ఇప్పుడు వినాయక చవితి సీజన్ ఖాళీగా ఉంది. ఈ పండక్కి విడుదల కావాల్సిన రామ్ పోతినేని, బోయపాటి శ్రీనుల 'స్కంద - ది ఎటాకర్'తో పాటు రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించిన 'చంద్రముఖి 2' కూడా వెనక్కి వెళ్లాయి. 'సలార్' వాయిదా పడటంతో సెప్టెంబర్ నెలాఖరున విడుదలకు రెడీ అయ్యాయి. దాంతో వినాయక చవితికి పెద్ద సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. ఈ అవకాశాన్ని కొన్ని చిన్న సినిమాలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. అందులో 'సోదర సోదరీమణులారా' సినిమా ఒకటి.  


సెప్టెంబర్ 15న 'సోదర సోదరీమణులారా'
కమల్ కామరాజు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరో వైపు మంచి కథలు, క్యారెక్టర్లు వస్తే ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ ఆయన కనిపిస్తున్నారు. 'విరూపాక్ష' చిత్రంలో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ ఏడాది ఆయన ఖాతాలో ఓ విజయం పడింది. ఈ వారం హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన రెడీ అయ్యారు.   


కమల్ కామరాజు (Kamal Kamaraju) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సోదర సోదరీమణురాలా' (Sodara Sodarimanulara). అపర్ణా దేవి ప్రధాన పాత్ర  పోషించారు. దీంతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథను కూడా ఆయనే అందించారు. 9 ఈఎం ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐఆర్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రమిది. విజయ్ కుమార్ పైండ్ల నిర్మాత. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నట్లు నిర్మాత తెలిపారు.  తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. 


క్యాబ్ డ్రైవర్ మీద అన్యాయంగా కేసు పెడితే?
'సోదర సోదరీమణులారా'లో క్యాబ్ డ్రైవర్ పాత్రలో, సగటు మధ్య తరగతి భర్తగా కమల్ కామరాజు నటించారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక సతమతం అవ్వడం కాదు... డబ్బులు లేక పడిన ఇబ్బందులను సైతం ట్రైలర్ లో చూపించారు. కమల్ కామరాజు భార్య పాత్రలో అపర్ణా దేవి నటించారు. 


Also Read : మహాశివునిగా ప్రభాస్ - ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!



'బాహుబలి'లో కాలకేయుడిగా అలరించిన ప్రభాకర్, ఈ 'సోదర సోదరీమణురాలా'లో విలన్ రోల్ చేశారు. పోలీస్ అధికారిగా విలనిజం చూపించనున్నారు. అన్యాయంగా క్యాబ్ డ్రైవర్ మీద కేసు పెడతారు. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో పృథ్వీ పాత్ర ఏమిటి? అనేది సెప్టెంబర్ 15న వెండితెరపై చూడాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ బేస్ చేసుకుని తీసిన చిత్రమిది. థియేటర్లలో ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడం ప్లస్ పాయింట్. మంచి టాక్ వస్తే ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది.     


Also Read మెహర్ రమేష్ తీసిన 'మెగా' డిజాస్టర్ - చిరంజీవి 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్



కమల్ కామరాజు, అపర్ణా దేవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో 'కాలకేయ' ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కూర్పు  : పవన్ శేఖర్ పసుపులేటి, ఛాయాగ్రహణం : మోహన్ చారి, నేపథ్య సంగీతం : వర్ధన్, నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల, రచన - దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial