Sobhita Dhulipala on wedding with Naga Chaitanya: శోభితా ధూళిపాళ... కొన్ని రోజుల క్రితం వరకు ఆమెను తెలుగు అమ్మాయిగా, హిందీ సినిమా ఇండస్ట్రీలోనూ పేరు తెచ్చుకున్న కథానాయికగా చూశారు. కానీ, ఇప్పుడు ఆమెను అక్కినేని కోడలిగా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో ఆమె నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దాని గురించి, చైతూతో పెళ్లి గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆవిడ ఓపెన్‌గా చెప్పారు.
పెళ్లి... పిల్లలు... ముందు నుంచి శోభిత ఆలోచనలు!
పెళ్లి చేసుకోవాలని, ఏదో ఒక రోజు పిల్లల్ని కనాలని ముందు నుంచి తాను కలలు కనేదానిని అని, తన మదిలో ఆ ఆలోచన ఉందని శోభితా ధూళిపాళ తెలిపారు. ఆ అంశాల గురించి ఆమె మాట్లాడుతూ... ''మాతృత్వపు మధురానుభూతి కావాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. నాకు ఆ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. పెళ్లి చేసుకోవడం ఖాయం. వివాహ బంధంలో నన్ను నేను చూసుకున్నాను. నాకు మా తెలుగు సంప్రదాయాలు, తల్లిదండ్రులు అంటే గౌరవం. నా జీవితంలోనూ ఆ విధమైన తెలుగింటి మూలాలు ఉండాలని కోరుకున్నా'' అని పేర్కొన్నారు.
పెళ్లిలో తెలుగు వధువు ధరించే లగ్గం చీర కట్టుకుంటా!
నిశ్చితార్థం రోజున మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర కట్టుకున్నారు శోభితా ధూళిపాళ. మరి పెళ్లికి ఎవరు డిజైన్ చేసిన చీర కడతారు? దానికోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వంటి ఆలోచనలు కూడా కొంతమందికి ఉంటాయి. పెళ్లి చీర గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడారు సాధారణంగా తెలుగు అమ్మాయిలు పెళ్లి రోజున లగ్గం చీర కడతారని, సిల్క్ సారీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారని తాను కూడా అటువంటి చీర కట్టుకోవాలని అనుకుంటున్నట్లు శోభితా ధూళిపాళ తెలిపారు.
నిశ్చితార్థం సింపులే... అయితే అలాగే ఉండాలని!
నాగ చైతన్యతో తన నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగిందని శోభితా ధూళిపాళ అంగీకరించారు. ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధు - మిత్రుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకకు ప్రత్యేకించి హంగు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదని కూడా ఆవిడ చెబుతున్నారు.
Also Read: సారీ ప్రకాష్ రాజ్ గారూ... తెలుగులో విమర్శకుల ఛాన్స్ ఇవ్వని 'వేట్టైయాన్'
''నిశ్చితార్థానికి ఎక్కువ అంచనాలు ప్లానింగ్ వంటి వాటితో వెళ్ళలేదు. చాలా రిలాక్స్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉండాలని అనుకున్నాం. నేను ఎలా అయితే జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది. అందమైన విషయాలు అద్భుతాలు జరిగినప్పుడు ఎటువంటి హంగు ఆర్పాటాలు అవసరం లేదు. క్షణాలు మనతో ఎప్పటికీ ఉంటాయి. అందుకని అది సింపుల్ ఈవెంట్ అని నేను అనుకోవడం లేదు. ఎంగేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా జరిగింది'' అని చెప్పారు శోభిత ధూళిపాళ.