ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (SJ Suryah On Pawan Kalyan)కు, తమిళ దర్శకుడు - నటుడు ఎస్‌జే సూర్య మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జూలై 7 (ఆదివారం) హైదరాబాద్ వచ్చిన ఎస్‌జే సూర్య... పవన్ రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడారు. 


మూడేళ్ళ క్రితమే సీఎం అవుతాడని చెప్పా!
''కమల్ హాసన్ గారు చెప్పారు. దర్శకుడు శంకర్ గారి కాన్సెప్టులో ఉంది. ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గొప్ప పనులు చేశారో... వారు 'ఇండియన్' అని చెప్పారు. ప్రతి ఒక్కరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి నేను ఇక్కడ ఇంకో పాయింట్ అందరితో పంచుకోవాలి. అటువంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండీ. నేను ముందే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా స్నేహితుడు అని ఒక రోజు గౌరవంగా చెబుతానని నేను మూడు సంవత్సరాల క్రితం చెప్పాను. సగం ప్రూవ్ అయ్యింది. మిగతా సగం మీరే (వేదిక ముందు ఉన్న ప్రేక్షకులను ఉద్దేశిస్తూ...) చేయాలి'' అని ఎస్‌జే సూర్య అన్నారు. ఆయన మాటలకు ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. 'భారతీయుడు 2' సినిమాలో తన పాత్ర విషయానికి వస్తే... అతిథి పాత్రకు కాస్త ఎక్కువ అన్నట్టు ఉంటుందని, 'భారతీయుడు 3'లో ఎక్కువ సేపు కనిపిస్తానని ఆయన తెలిపారు.






పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ 'ఖుషి'కి ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేసిన 'కొమురం పులి' ఆశించిన విజయం సాధించలేదు. పవర్ స్టార్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ 'పంజా' వెనుక ఎస్‌జే సూర్య ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్, పవన్ కలిసి సినిమా చేస్తే బావుంటుందని ఇద్దరిని కలిపారు.


Also Read: ప్రియాంకా మోహన్ కాదు... చారులత - Saripodhaa Sanivaaramలో హీరోయిన్ ఫస్ట్ లుక్ చూశారా?



జూలై 12న థియేటర్లలోకి 'భారతీయుడు 2'
Kamal Haasan's Indian 2 Release Date: కమల్ హాసన్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ సుమారు 28 ఏళ్ల క్రితం తెరకెక్కించిన 'భారతీయుడు' (తమిళంలో 'ఇండియన్') చిత్రానికి ఈ 'భారతీయుడు 2' (తమిళంలో 'ఇండియన్ 2') సీక్వెల్. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. గుల్షన్ గ్రోవర్, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా... లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలపై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేశారు. జూలై 12న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.


Also Readవేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కౌంటర్ - అబ్బాయి పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!