Priyanka Mohan: ప్రియాంకా మోహన్ కాదు... చారులత - Saripodhaa Sanivaaramలో హీరోయిన్ ఫస్ట్ లుక్ చూశారా?
Saripodhaa Sanivaaram Actress Name: నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న తాజా సినిమా 'సరిపోదా శనివారం'. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Priyanka Arul Mohan Telugu Movies: నేచురల్ స్టార్ నాని, తమిళ క్యూట్ పొన్ను ప్రియాంకా అరుల్ మోహన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా 'సరిపోదా శనివారం'. ఈ రోజు హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇన్నోసెంట్ పోలీస్ చారులతగా...
Priyanka Mohan as Charulatha in Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఆమె ఫస్ట్ లుక్ చూస్తే ఎవరైనా ఈజీగా చెప్పేయవచ్చు. అమాయకపు పోలీస్ చారులత పాత్రలో ఆవిడ నటిస్తున్నట్లు చిత్ర బృయ్నడం పేర్కొన్నారు.
భుజాన బ్యాగ్, ఒంటి మీద ఖాకీ డ్రస్, ముఖం మీద చిరునవ్వు... తల పైకి ఎత్తి రోడ్డు మీద నడుస్తున్న ప్రియాంకా అరుల్ మోహన్ ఫస్ట్ లుక్కును 'సరిపోదా శనివారం' చిత్ర బృందం విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్‌గా ఆ లుక్ హిట్ అయ్యింది. కథలో ఆమె క్యారెక్టర్ చాలా కీలకమని చిత్ర బృందం పేర్కొంది.
Also Read: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కౌంటర్ - అబ్బాయి పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
నానితో దర్శకుడికి రెండో సినిమా... ప్రియాంకకు కూడా!
'సరిపోదా శనివారం' సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నానితో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్లిద్దరి కలయికలో 'అంటే సుందరానికి' సినిమా వచ్చింది. అన్నట్టు... నానితో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ (Nani and Priyanka Arul Mohan Movies)కు కూడా రెండో చిత్రమిది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో ఇంతకు ముందు వీళ్లిద్దరూ జంటగా నటించారు. ఆ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ శారీ కట్టుకుని వచ్చినప్పుడు నాని చూసే సన్నివేశం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.
'సరిపోదా శనివారం' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya), ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనిని భారీ నిర్మాణ వ్యయం, అత్యున్నత సాంకేతిక నిపుణులతో పాన్ ఇండియన్ అడ్రినలిన్ ఫీల్డ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
Also Read: హైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!
Saripodhaa Sanivaaram Cast And Crew: 'సరిపోదా శనివారం' సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరొక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జెక్స్ బిజాయ్ మ్యూజిక్ డైరెక్టర్. సాధారణంగా వివేక్ ఆత్రేయ సినిమాలకు వివేక్ సాగర్ సంగీతం అందించడం కామన్. కానీ, ఈ సినిమాకు సంగీత దర్శకుడిని మార్చారు వివేక్ ఆత్రేయ. 'సరిపోదా శనివారం' చిత్రానికి ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: మురళి జి, సంగీతం: జెక్స్ బిజాయ్, నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: డీవీవీ దానయ్య - దాసరి కళ్యాణ్, దర్శకుడు: వివేక్ ఆత్రేయ.