Hyper Aadi: హైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!

Dhee Celebrity Special 2 Latest Promo: ఢీ సెలబ్రిటీ స్పెషల్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో హైపర్ ఆది పరువు తీసేసింది హన్సిక. శ్రీ సత్య అయితే తనను టచ్ చెయ్యవద్దని కామెంట్స్ చేసింది.

Continues below advertisement

Dhee Latest Episode Promo: 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2లో ఫేమస్ కమెడియన్ 'హైపర్' ఆది ఒక టీమ్ లీడర్ కాగా... 'బిగ్ బాస్' ఫేమ్, సీరియల్ ఆర్టిస్ట్ శ్రీ సత్య మరో టీమ్ లీడర్. వాళ్లిద్దరి మధ్య సరదా సరదా సన్నివేశాలు చోటు చేసుకోవడం కామన్. ఆ సీన్స్ అన్నీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చెయ్యడం కోసమే. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమో గానీ శ్రీ సత్య మీద హైపర్ ఆది సెటైర్స్ పడ్డాయి. అతడి పరువు తీసేసింది హన్సిక.

Continues below advertisement

టచప్ చెయ్... కానీ టచ్ చెయ్యకు!
జూలై 10, 11వ తేదీల్లో టెలికాస్ట్ అయ్యే 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2' ఎపిసోడ్స్ ప్రోమో లేటెస్టుగా రిలీజ్ చేశారు. అందులో కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లు, టీమ్ లీడర్స్ ఇంట్రడక్షన్ అయ్యాక...

''ఫస్ట్ అర్జంటుగా టచప్ చెయ్! టచప్ పేరుతో నన్ను టచ్ చెయ్యకు. ఎందుకు అంటే... ఇప్పటి వరకు నన్ను ఎవరూ టచ్ చెయ్యలేదు'' అని శ్రీ సత్య సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పింది. హైపర్ ఆది వైపు వేలు చూపిస్తూ మాట్లాడింది. ఆ తర్వాత ''మొన్న అదేదో షోలో చూశాను. వాడు గిరగిరా తిప్పేస్తున్నాడు. వెనుక వేస్తున్నాడు'' అని ఆది సెటైర్ వేశాడు.

Also Read: రీతూ చౌదరి లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన విష్ణుప్రియ - ఇదెక్కడి ట్విస్ట్ రా మావ!

ఢీ ఈటీవీ షో అయితే... అందులో శ్రీ సత్య టీమ్ లీడర్. మరొక ఛానల్ డ్యాన్స్ షోలో శ్రీ సత్య కంటెస్టెంట్. అందులో ఆవిడ రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చేసిన సాంగ్స్ ఉన్నాయి. వాటిని ఉద్దేశిస్తూ హైపర్ అది సెటైర్ వేశాడు. ఆ వెంటనే 'అయిపోయే' అంటూ చిన్న జీయర్ స్వామి వాయిస్ రావడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. 

అది పరువు తీసేసిన హన్సిక... ఆ మాట అనేసింది!
'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2 స్టార్ట్ అయినప్పటి నుంచి 'హైపర్' ఆదిని జడ్జ్ సీటులో ఉన్న యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ ఒక ఆట ఆడుకుంటోంది. ఆ ఇద్దరి మధ్య ట్రాక్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇంతకు ముందు ఒకసారి 'నోరు మూసుకో' అని చెప్పింది. అఫ్ కోర్స్ అది అంతా సరదాగా అనుకోండి. ఈసారి అయితే పరువు తీసి పారేసింది. 

Also Readకాలర్ పట్టుకుని లాగి పెట్టి కొట్టిన అనసూయ - మెహదీపట్నంలో ఆకతాయికి మాస్ వార్నింగ్!

'హన్సిక... ' అని పిలిచాడు 'హైపర్' ఆది. 'ఏంట్రా...' అని అడిగింది హన్సిక. 'ఐ లవ్ యు రా' అని రొమాన్స్ ఒలకబోస్తూ ప్రపోజ్ చేశాడు ఆది! అందుకు బదులుగా చాలా చక్కగా నవ్వుతూ 'ఐ హేట్ యు రా' అన్నది హన్సిక. 'అందరి ముందు పరువు పోయిందిగా' అని సునీల్ వాయిస్ రావడంతో సైలెంట్ అయ్యాడు. 'హైపర్' ఆది మీద కంటెస్టెంట్ కమ్ కొరియోగ్రాఫర్ పండు ఫైర్ అవ్వడం కూడా నవ్వించింది. ఇక ప్రోమో ఎండింగ్ వచ్చేసరికి శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడం డ్యాన్సర్స్ అందరినీ కంటతడి పెట్టించింది.

Continues below advertisement