Fahadh Faasil in Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కూలీ సినిమా షూటింగ్ జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆ తరవాత జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టియాన్ (Vettaiyan) మూవీకి రెడీ అవుతున్నారు రజనీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ దశకు వచ్చేసింది. ఈ మూవీలో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ యాక్ట్ చేస్తున్నాడు. ఓ ఫన్నీ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫాహద్ ఇప్పుడు డబ్బింగ్ మొదలు పెట్టాడు. డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ ఈ ఫొటోలు షేర్ చేసింది. రజినీ కాంత్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో అమితాబ్ కూడా యాక్ట్ చేస్తున్నారు.
రాణా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, రోహణి, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. రజినీ కాంత్, ఫాహద్ ఫజిల్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్‌కీ ఇదే కిక్ ఫ్యాక్టర్ కానుంది. ఇప్పటికే పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు షెకావత్ గా పరిచయమయ్యాడు ఫాహద్. ఇటీవల విడుదలైన ఆవేశం సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. మలయాళ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులందరికూ ఫాహద్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. విలన్ అంటే చాలా కర్కశంగా ఉంటాడనే ఫార్మాట్‌ని మార్చేసి చాలా ఫన్నీగా చూపించారు. ఇదే అందరికీ తెగ నచ్చేసింది. వెట్టియాన్‌తో పాటు పుష్ప 2లోనూ నటించాడు ఫాహద్. ఆ తరవాత Don't Trouble the Trouble,ఆక్సిజన్ సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. వెట్టియాన్ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోంది.
Also Read: Indian 2: ఇండియన్ 3 నచ్చిందంటే ఇండియన్ 2 నచ్చలేదని కాదు, కాంట్రవర్సీపై కమల్ క్లారిటీ