ప్రస్తుతం సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిన తమిళ నటుడు ఎస్. జే సూర్య విభిన్న తరహా పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సౌత్ లో బలమైన పాత్రల్లో కనిపించే నటీనటులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కోలీవుడ్లో విజయ్ సేతుపతి, ఎస్ జే సూర్య లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు అగ్ర హీరోల సినిమాలో బలమైన పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ఆ బలమైన పాత్రల కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. నిర్మాతలు కూడా వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి సిద్ధ పడుతున్నారు.


రీసెంట్ గా 'మార్క్ ఆంటోనీ' సినిమాలో వన్ మ్యాన్ షో పర్ఫామెన్స్ తో అదరగొట్టిన ఎస్. జే సూర్య తాజాగా టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ హీరోగా నటించిన 'మార్క్ ఆంటోనీ' సినిమాలో ఎస్ జె సూర్య నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో విశాల్ ని డామినేట్ చేసి మరీ నటించాడు ఎస్. జె సూర్య. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు తనదైన విలనిజాన్ని చూపించాడు. సినిమాలో ఎస్ జె సూర్య నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. దాంతో టాలీవుడ్ లోనూ ఈయనకి డిమాండ్ పెరిగింది.


ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'సరిపోదా శనివారం' సినిమాలో ఎస్. జె సూర్య కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందుకోసం ఆయన రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాని సినిమా కోసం SJ సూర్య దాదాపు రూ.8 కోట్లు పారితోషకంగా అందుకుంటున్నారట. రీసెంట్ గా 'మార్క్ ఆంటోనీ' మూవీలో ఎస్. జె సూర్య యాక్టింగ్ నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. నాని చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. అందుకే ఈ మూవీలో కీలక పాత్రకి సూర్య అయితేనే సరైన న్యాయం చేస్తారని భావించిన నిర్మాతలు ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


ఒక క్యారెక్టర్ రోల్ కి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఎస్. జె సూర్యకి ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న తొలి నటుడిగా ఎస్ జె సూర్య రికార్డ్ క్రియేట్ చేశారు. మొత్తం మీద నాని సినిమా కోసం ఎస్. జె సూర్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించే ఇండ్రస్ట్రీ లో డిస్కషన్ నడుస్తుంది. ఇక 'సరిపోదా శనివారం' సినిమా విషయానికొస్తే.. నాని కెరీర్ లో 31 వ సినిమా ఇది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బార్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జేక్స్ బీజాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా మురళీ జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 


Also Read : ’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ - కేక పుట్టిస్తున్న విశ్వక్ సేన్ పొలిటికల్ లుక్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial