Hebah Patel's The Great Indian Suicide Movie : హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'. ఇందులో రామ్ కార్తీక్ హీరోగా నటించారు. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో దర్శకుడు విప్లవ్ కోనేటి (Viplove Koneti) స్వీయ నిర్మాణంలో తెరకెక్కింది. ఆహా ఓటీటీలో అక్టోబర్ 6 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. 


ఇప్పటి వరకు ఐదు కోట్ల నిమిషాలు...  
ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' సినిమాను ఇప్పటి వరకు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ (అంటే తెలుగులో అక్షరాలా ఐదు కోట్ల నిమిషాల పాటు) పాటు ఆహాలో వీక్షకులు సినిమా చూశారు. చిన్న సినిమాగా విడుదలై... ఇప్పుడు భారీ వీక్షకాదరణ సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. 


నిజం చెప్పాలంటే... థియేటర్లలో విడుదల చేయడం కోసం ఈ సినిమా తీశారు. ఈ చిత్రానికి తొలుత 'తెలిసిన వాళ్ళు' టైటిల్ పెట్టారు. దాన్ని 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'గా మార్చి ఆహాలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేశారు. నిస్వార్థ ప్రేమికుడిగా రామ్ కార్తీక్ నటన, విప్లవ్ కోనేటి దర్శకత్వం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. దొంగ స్వామిజీల కపట నాటకాలను ఈ సినిమాలో దర్శకుడు చూపించారు. 


Also Read అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?



సినిమా కథ విషయానికి వస్తే... హేమంత్ (రామ్ కార్తీక్) అనాథ. సొంతంగా కాఫీ షాప్ రన్ చేస్తున్నాడు. ఆ షాపులోకి చైత్ర (హెబ్బా పటేల్) హోమ్ మేడ్ కుకీస్ సరఫరా చేస్తుంటుంది. ఆమె పద్ధతి, తీరు చూసి హేమంత్ ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశ పడతాడు. ఆ విషయం ఆమెతో చెబుతాడు. హేమంత్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ చైత్ర 'నో' చెబుతుంది. తన కుటుంబం అంతా కొన్ని రోజుల్లో సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెబుతుంది. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కల్ట్ సూసైడ్ ఎందుకు ప్లాన్ చేశారు? దీని వెనుక చైత్ర పెదనాన్న నీలకంఠం (సీనియర్ నరేష్) పాత్ర ఏమిటి? నరేష్ భార్యగా నటించిన పవిత్రా లోకేష్, ఇతర కుటుంబ సభ్యుల పాత్రలు ఏమిటి? అనేది 'ఆహా' ఒరిజినల్ సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' చూసి తెలుసుకోవాలి.


Also Read : శర్వానంద్, కృతి శెట్టి సినిమా టైటిల్ మారుతోందా?


హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, సీనియర్ నరేష్ (Naresh VK), పవిత్రా లోకేష్, జయ ప్రకాష్ నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్, అనంత్ నాగ్ కావూరి, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, సాహిత్యం: డాక్టర్ జివాగో, నృత్యాలు : జావేద్ మాస్టర్, పోరాటాలు : సీహెచ్ రామకృష్ణ, కళ : ఉపేందర్ రెడ్డి, సంగీతం : శ్రీ చరణ్ పాకాల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం,నిర్మాత : విప్లవ్ కోనేటి.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial