'పలాస' మూవీతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి హీరోగా 'నరకాసుర'(Narakasura) అనే సినిమా తెరకెక్కింది. సెబాస్టియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే మరోసారి 'పలాస' తరహాలోనే రా అండ్ రస్టిక్ సినిమాతో రక్షిత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'పలాస 1978' మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్ధన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. మీ ఆలోచనలే మీ శత్రువులు అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


మలయాళ నటి సంగీర్ధన విపిన్, సీనియర్ నటుడు నాజర్, శత్రు, శ్రీమాన్ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే కథగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ట్రైలర్ను గమనిస్తే.. యాక్షన్, ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపైనే 'నరకాసుర' ట్రైలర్ ను కట్ చేశారు. "నువ్వు నిర్మించకు ఈ ప్రపంచంలో అంతా నీవాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాధవే. కొన్నిసార్లు దేవుళ్ళు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది" వంటి డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.


ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఓ అడవికి సమీపంలో ఉండే గ్రామం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ని సైతం హైలెట్ చేశారు. ఆ యాక్షన్స్ సీన్స్ వెనుక వచ్చే బీజీయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీన్నిబట్టి ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. తాజాగా విడుదలైన 'నరకాసుర' ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్ బ్యానర్స్ పై శ్రీనివాస్, కారుమూరు రఘు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా నౌఫర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్ 3న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ట్రైలర్ కంటే ముందు ఈ చిత్రం నుంచి రెండవ పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. పాటని విడుదల చేసిన కిరణ్ అబ్బవరం 'ఈ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మూవీ టీం కి తన బెస్ట్ విషెస్ అందజేశారు'. హీరో రక్షిత్ శెట్టి ఈ చిత్రంతో పాటు ఆపరేషన్ రావణ' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారు.


Also Read : ఆహా... హెబ్బా పటేల్ సినిమాకు సూపర్ రెస్పాన్స్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial