Sivakarthikeyan Amaran Movie Telugu Theatrical Rights హీరో నితిన్‌ హోమ్‌ బ్యానర్లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ రాబోతోంది. శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్లో నితిన్‌ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖిత రెడ్డి సినిమాలు నిర్మించడంతో పాటు, ఇతర చిత్రాలను కూడా డిస్ట్రీబ్యూట్‌ చేస్తూంటారు. ఇతర భాష చిత్రాల తెలుగు రైట్స్‌ తీసుకుని ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు. గతంలో లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల థీయాట్రికల్ రైట్స్‌ శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకుని ఇక్కడ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.


ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో వారికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో తమిళ్ మూవీ తెలుగు రాష్ట్రాల థీయాట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యానర్‌. స్టార్‌ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ 'అమరన్‌'. రాజ్ కుమార్ పెరిస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్‌ హక్కకులను తాజాగా శ్రేష్ట్‌ మూవీస్‌ దక్కించుకుంది. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటెర్నేషనల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిరమించా నిర్మిస్తున్నాయి.






కాగా రాజ్ కమల్ బ్యానర్ కమల్ హాసన్ దనే సంగతి తెలిసిందే. విక్రమ్ సినిమాతో శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డితో కమల్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో అమరన్ సినిమా తెలుగు థీయాట్రికల్ రైట్స్‌ని కూడా శ్రేష్ట్‌ మూవీస్‌ దక్కించుకుంది. ఇందుకోసం నిర్మాతలకు శ్రేష్ట్‌ మూవీస్‌ భారీగానే చెల్లించారట.  శివ కార్తికేయన్‌ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ బేస్ ఉంది. దాదాపు ఆయన కెరీర్‌లో అన్ని హిట్స్‌ చిత్రాలే. తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. దీంతో అమరన్‌ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 'అమరన్‌' సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.



శివ కార్తికేయన్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఫస్ట్‌ చిత్రమిది. పైగా పాన్‌ ఇండియాగా వస్తోన్న ఈ చిత్రంపై సౌత్‌లో మంచి బజ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఢిల్‌కు అమరన్‌ తెలుగు రైట్స్ దక్కించుకుంది శ్రేష్ట్‌ మూవీస్‌. శివ్ అరోరా, రాహుల్ సింగ్ రాసిన 'ఇండియన్ మోస్ట్ ఫియర్ లెస్' బుక్‌లోని ప్రధాన పాత్ర మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా అమరన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో శివ కార్తికేయన్‌ మేజర్ వరదరాజన్  పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. 


Also Read: రుహానీ శర్మ బోల్డ్‌ సీన్స్‌ వైరల్‌! - గర్వంగా ఉందంటూ నటి ఎమోషనల్‌ పోస్ట్‌