Ravi Teja Discharged From Hospital: మాస్ మహారాజ్ రవితేజ ఆసత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న షూటింగ్ తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకున్న ఆయన ఈ రోజు ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. "సాఫీగా సాగిన సర్జరీ తర్వాత సక్సెస్‌ఫుల్‌గా డిశ్చార్జ్ అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలు మద్దతుకు కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్న. త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇక ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న ఫ్యాన్స్ ఆయన ట్వీట్‌తో ఊపీరి పిల్చుకున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ఆయన ట్వీట్‌పై స్పందిస్తున్నారు. కాగా ఇటీవల మిస్టర్ బచ్చన్‌తో ఫ్యాన్స్‌ని అలరించిన ఆయన ఆ వెంటనే తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న RT75 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఆగస్టు 23) ఆయనకు నగర శివారులో అల్యూమినియం ఫ్యాక్టరీ యాక్షన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా రవితేజ ప్రమాదం బారిన పడ్డారు.
మొదట స్వల్పంగా గాయపడ్డ ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో ఆయన గాయం తీవ్రమైంది. దీంతో ఆయనను యశోద ఆసత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతి నరాలు చిట్లాయని, శస్త్ర చికిత్స తప్పసరి అని వైద్యులు సూచించారు. అవిశ్రాంతంగా షూటింగ్ చేయడ వల్లే ఇలా జరిగిందని, ఆయనకు ఆరు వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు సూచించారు.
Also Read: రుహానీ శర్మ బోల్డ్ సీన్స్ వైరల్! - గర్వంగా ఉందంటూ నటి ఎమోషనల్ పోస్ట్