దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన సినిమా 'సీతా రామం' (Sita Ramam Telugu Movie). ఇందులో రష్మికా మందన్నా (Rashmika Mandanna), తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam) కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5న... అనగా నిన్న థియేటర్లలో విడుదలైందీ సినిమా.
'సీతా రామం' చిత్రాన్ని కవితాత్మక ప్రేమ కథగా విమర్శకులు అభివర్ణించారు. అటు ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో హిట్ అంటూ చాలా ట్వీట్లు కనిపించాయి. అయితే... సినిమాకు మాత్రం ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. తొలి రోజు థియేట్రికల్ బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ చాలా తక్కువ కనిపించాయి.
Sita Ramam First Day Collections In Telugu States : తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల అయ్యింది. దుల్కర్ సల్మాన్ మలయాళీ కావడంతో కేరళలో సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని ఆశించారు. తెలుగులో దర్శకుడు హను రాఘవపూడి, చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌కు ఉన్న బ్రాండ్ వేల్యూ దృష్ట్యా... డీసెంట్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేశారు. అంచనాలకు భిన్నంగా 'సీతా రామం' కలెక్షన్స్ ఉన్నాయి.
'సీతా రామం' తొలి రోజు కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే... రెండు కోట్లు కూడా రాలేదు. కోటిన్నర దగ్గర ఆగింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా 'సీతా రామం' ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 54 లక్షలు
ఉత్తరాంధ్ర : రూ. 23 లక్షలు
సీడెడ్ : రూ. 16 లక్షలు
నెల్లూరు : రూ. 5 లక్షలు
గుంటూరు : రూ. 16 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 13 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 15 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 8 లక్షలు
ఏపీ, తెలంగాణ... మొత్తం మీద 1.50 కోట్ల రూపాయల షేర్ లభించింది. గ్రాస్ వసూళ్లు చూస్తే... 2.25 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇతర భాషల్లో కూడా అంతే!
తెలుగు కాకుండా ఇతర భాషల్లో కూడా 'సీతా రామం' చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాలేదు. కేవలం 35 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం పర్వాలేదు. కోటి ఐదు లక్షల రూపాయలు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే... ఈ సినిమా రూ. 3.05 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ వసూళ్లు చూస్తే... రూ. 5.60 కోట్లు ఉన్నాయి.
Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
క్లాస్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయా?'సీతా రామం'తో పాటు విడుదల అయిన 'బింబిసార' మంచి వసూళ్లు నమోదు చేసింది. ఆ స్థాయిలో ఈ సినిమాకు రాకపోవడానికి క్లాసిక్ సినిమా కావడం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రెండో రోజు నుంచి సినిమా పికప్ కావచ్చని అంచనా వేస్తారు.