ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee Actor) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'హైవే' (Highway Telugu Movie). ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. '118', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ రోజు ఆహాలో హైవే వస్తున్న సంగతి అనౌన్స్ చేశారు.


హైవే కథ ఏంటి (Highway Telugu Movie Story)?
'హైవే' సినిమాలో ఫోటోగ్రాఫర్ విష్ణు పాత్రలో యువ హీరో ఆనంద్ దేవరకొండ కనిపించనున్నారు. ఆయనకు జోడీగా మానస నటించారు. ఆమె పాత్ర పేరు తులసి. ఆమెతో విష్ణు ప్రేమలో పడతాడు. సంతోషంగా, సాఫీగా సాగిపోతున్న విష్ణు, తులసి ప్రేమ కథలో ఒక సీరియల్ కిల్లర్ 'డి' ప్రవేశిస్తాడు. అతడి నుంచి తన ప్రేయసిని విష్ణు కాపాడుకోగలుగుతాడా? లేదా? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
 
సైకలాజికల్ థ్రిల్లర్
'హైవే' ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని ఆహా ఓటీటీ ప్రతినిధులు తెలిపారు. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయని చిత్ర బృందం తెలిపింది. వీక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతి ఇస్తుందని పేర్కొంది. స్వతహాగా కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ మీద స్పెషల్ కేర్ తీసుకున్నారట. విజువల్స్ కాకుండా కంటెంట్ కూడా కొత్తగా ఉంటుందని, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని యూనిట్ సభ్యులు తెలిపారు.  


Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?


'దొరసాని' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ, ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'పుష్పక విమానం' సినిమాల్లో నటించారు. ఈ 'హైవే' కాకుండా ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అభిషేక్ బెనర్జీ హిందీలో ఫేమస్ యాక్టర్. ఆయన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించారు. 'పాతాళ్ లోక్', 'మీర్జాపూర్' సిరీస్ లు ఆయన గుర్తింపు తెచ్చాయి. 


ఆనంద్ దేవరకొండకు రెండో ఓటీటీ ప్రాజెక్ట్ ఇది. కరోనా కాలంలో ఆయన నటించిన 'మిడిల్ క్లాసు మెలోడీస్' ఓటీటీలో విడుదల అయ్యింది. మరోసారి 'హైవే'తో ఆయన ఓటీటీ వీక్షకుల ముందుకు రానున్నారు. ఓటీటీలు, వెబ్ సిరీస్ లు అభిషేక్ బెనర్జీకి కొత్త కాదు. కానీ, ఆయనకు తొలి తెలుగు సినిమా ఇది. ఇప్పటి వరకు ఆయన హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేశారు. తొలిసారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'హైవే'లో ఆయన సీరియల్ కిల్లర్ రోల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అభిషేక్ బెనర్జీ నటుడు మాత్రమే కాదు... కాస్టింగ్ డైరెక్టర్ కూడా!     



Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్