ప్రముఖ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్న ఘటన తెలుగు, తమిళ చిత్రసీమలను షాక్‌కు గురి చేసింది. అయితే ఒకప్పుడు అగ్ర గాయనిగా కొనసాగిన కల్పన తన కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను సాధించింది. కేవలం గాయనిగా మాత్రమే కాకుండా నటిగా, రచయితగా కూడా ఆమె ఇండస్ట్రీలో రాణించింది. ఐదేళ్ల వయసులోనే సింగర్ కెరీర్ స్టార్ట్ చేసిన కల్పన... 2013 నాటికి భారతదేశంతో పాటు విదేశాల్లోనూ 1500 పాటలను రికార్డు చేసింది. అంతే కాకుండా దాదాపు 3000 కాన్సర్ట్ లలో పర్ఫామ్ చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మలయాళ టీవీ ఛానల్‌లో ప్రసారమైన 'స్టార్ సింగర్ సీజన్ 5' విజేతగా నిలిచింది. అలాగే 'సూపర్ సింగర్ జూనియర్' షోకి జడ్జ్ గా వ్యవహరించింది. అంతేకాకుండా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 1'లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.
కల్పనా రాఘవేందర్ పాడిన పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. భక్తి పాటల నుంచి మొదలు పెడితే రొమాంటిక్, ఐటం సాంగ్స్.. ఇలా అన్ని జానర్ల పాటలు పాడి, తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంది ఈ సింగర్. ఆవిడ పాడిన పాటల్లో బెస్ట్ అండ్ టాప్ 10 సాంగ్స్ ఏవో చూడండి.
కల్పన పాడిన టాప్ 10 తెలుగు బెస్ట్ సాంగ్స్
- జూలే జూలే - వర్షం సినిమా
- యే జిల్లా - శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా
- గోంగూర - వెంకీ సినిమా
- అధిరే అధిరే - నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమా
- ఏ ఊరే చిన్నదానా - భద్ర
- ప్రేమంటే సులువు కాదురా - ఖుషి సినిమా
- ముసుగు వెయ్యొద్దు మనసు మీద - ఖడ్గం సినిమా
- చెలియా చెలియా సింగారం - కలుసుకోవాలని సినిమా
- అబ్బో నీ అమ్మ గొప్పదే - అంజి సినిమా
- శ్రీ ఆంజనేయ శ్లోకం - శ్రీ ఆంజనేయం సినిమా
కల్పన అందుకున్న అవార్డులు
ఇక కల్పన 2018 లో రిలీజ్ అయిన 'ఇంటింటా అన్నమయ్య' సినిమాలోని 'నవమూర్తులైనట్టి' అనే పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ గా నంది అవార్డును సొంతం చేసుకుంది. అలాగే 2015లో '36 వయదినిలే' చిత్రంలోని 'పోగిరెన్' అనే తమిళ పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డును కూడా దక్కించుకుంది. పైన చెప్పిన పాటలు కాకుండా 'పెళ్ళాం ఊరెళితే' సినిమాలోని 'దొండ పండు లాంటి' లాంటి పాట తనకు పేరు తెచ్చిందని కల్పన కొన్ని సందర్భాల్లో తెలిపారు.
కల్పనా రాఘవేందర్ మ్యూజిక్ నేపథ్యమున్న ఫ్యామిలీలో జన్మించారు. ఆమె తండ్రి టీఎస్ రాఘవేంద్ర ప్రముఖ సింగర్, నటుడు, మ్యూజిక్ డైరెక్టర్. ఆమె తల్లి సులోచన కూడా ఒక సింగర్. ఇక కల్పన తన కెరీర్లో ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కేవీ మహదేవన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ తో కలిసి పని చేసింది. అలాగే టాలీవుడ్లో శ్రీకాంత్, చిరంజీవి, ప్రభాస్, నితిన్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అదిరిపోయే సాంగ్స్ పాడింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో సాంగ్స్ లో పాడి సింగర్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?