ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్త టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం ఆమె హోలిస్టిక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. మరోవైపు విచారణ కోసం ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కల్పన హెల్త్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. యాంకర్ అనసూయ తాజాగా "ఆమెను అలా చూపించకండి" అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది.
కల్పనపై అనసూయ స్పెషల్ పోస్ట్
అనసూయ తాజాగా "దయచేసి ఆమెను ఆ స్థితిలో చూపించవద్దని సంబంధిత మీడియా సంస్థలను కోరుతున్నాను. ప్లీజ్ కొంచెం గౌరవించండి" అంటూ తన ఎక్స్ లో పోస్ట్ చేసింది. కానీ ఆమె ఆ పోస్ట్ లో ఎక్కడా కల్పన పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. మీడియాలో కల్పన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఫోటోలు, ఆమె అపస్మారక స్థితిలో ఉన్న పిక్స్ ను ప్రసారం చేయడం గురించి ఆమె ఈ కామెంట్స్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. చాలామంది కల్పన అభిమానులు సైతం అనసూయ పోస్ట్ కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే ?
ఒకప్పుడు స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలిగిన కల్పన కెరీర్ ఇప్పుడు మాత్రం స్లో అయ్యింది. హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ విల్లాలో తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె మొదటి భర్తకు విడాకులు ఇవ్వగా, రెండవ భర్త ప్రభాకర్ తో ఉంటోంది కల్పన. మంగళవారం ఆమె చెన్నైకి పని మీద వెళ్ళిన భర్తకు ఫోన్ చేసి, తాను అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్టు చెప్పిందని తెలుస్తోంది. దీంతో ఆమె భర్త అపార్ట్మెంట్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో, వారు కల్పన ఇంటి తలుపులను తెరవడానికి ట్రై చేసినట్టు తెలుస్తోంది. కానీ ఎంత పిలిచినా కల్పనా ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, అప్పటికే కల్పన అపస్మాక స్థితిలోకి వెళ్లిపోయి కనిపించింది. దీంతో దగ్గరలో ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించి ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను క్రిటికల్ ఈ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై ఉంచి, చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన అందరిని షాక్ కు గురి చేసింది. దీంతో కల్పనను పరామర్శించడానికి మంగళవారం రాత్రి పలువురు సింగర్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ లిస్టులో గీతా మాధురి, సునీత, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఉన్నారు. ఇక బుధవారం ఉదయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం హోలిస్టిక్ ఆస్పత్రిలోనే ఆమె చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే ఆమె భర్త ప్రభాకర్ ఒక బిజినెస్ మాన్. చెన్నైలో డెంటల్ సంబంధిత పార్ట్స్ కు సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉంటారు. పోలీసుల విచారణలో ప్రభాకర్ ఆమెకి నిద్ర మాత్రలు వాడే అలవాటు ఉందని, ఈ నేపథ్యంలోనే ఆమెకి నిద్ర మాత్రల ఓవర్ డోస్ కారణంగానే స్పృహ కోల్పోయిందని అనుమానిస్తున్నారు. కాగా రెండు రోజుల నుంచి తాను చెన్నైలో ఉన్నానని చెబుతున్నారు కల్పన భర్త.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?