Raa Raja Ready to Release: ‘రాజా’ అనగానే గుర్తొచ్చే పేరు పోసాని కృష్ణమురళి. ఆయన నానుడి పదం అది. ‘ఐ లవ్ యు రాజా’ అంటూ పోసాని కామెడీ పండిస్తుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ‘రా రాజా’ అంటూ ఓ ప్రయోగాత్మక చిత్రంతో పరీక్షకు సిద్ధమయ్యారు చిత్ర టీమ్. ‘రా రాజా’ టైటిల్ సౌండింగ్ టెంప్టింగ్‌గానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో, ఏమో తెలియదు కానీ, మేకర్స్ మాత్రం కచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ఉన్న విశేషం ఏమిటంటే, మొహాలు కనిపించకుండా సినిమా అంతా ఉండటం. నిజంగా ఇది మామూలు సాహసం కాదు. ఎంతగా ప్రయోగం చేసినా, ఆర్టిస్ట్‌లు ఎవరో తెలియకుండా కేవలం కథ, కథనాల మీదే సినిమా అంటే, ఇలా కూడా సాహసం చేయవచ్చా? అనేలా మేకర్స్ ఆశ్చర్యపరుస్తున్నారు. మార్చి 7న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా గురించి చిత్రయూనిట్ ఏం చెబుతున్నారంటే..


శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా రూపొందిన చిత్రం ‘రా రాజా’. బి. శివ ప్రసాద్ దర్శకుడు. మార్చి 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర వివరాలను తెలిపేందుకు చిత్రయూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు బి. శివ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని, సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


అనుకోకుండానే దర్శకుడిగా మారా!
‘రా రాజా’ దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు నిర్మాతగానే సినిమాలు చేస్తూ వస్తున్నాను. కానీ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా మారాను. ఒక సమయంలో నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్‌ను కథగా మార్చాను. ఆ కథే ‘రా రాజా’. ఈ కథని నేను అయితే కరెక్ట్‌గా తెరకెక్కించగలనని అనిపించింది. అలా, అనుకోకుండానే ఈ సినిమాతో దర్శకుడిగా మారిపోయాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగం ఈ సినిమా అని చెప్పగలను. చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారందరికీ నచ్చింది. మంచి సినిమా అని మెచ్చుకున్నారు. మార్చి 7న ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాన''ని అన్నారు.


Also Readవిజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి



మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ... ''రా రాజా' చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ దక్కింది. సరికొత్త సౌండింగ్ ఇందులో వింటారు. దర్శకుడు శివ ప్రసాద్ నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. మొదట నాకు ఆయన ఈ సినిమా కథ చెప్పినప్పుడు, నిర్మాతగానే చెబుతున్నారని అనుకున్నా. ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారు అని ఆసక్తిగా ఎదురు చూశా. కానీ, ఆయనే దర్శకుడనే విషయం ఆ తర్వాత నాకు అర్థమైంది. కథ నాకు బాగా నచ్చింది. సినిమా బాగా వచ్చింది. ఇలాంటి వైవిధ్యభరిత చిత్రాలకు మీడియా, ప్రేక్షకులు సినిమాకు సపోర్ట్ అందించాలని కోరారు. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇలాంటి మంచి అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు థాంక్స్. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి సక్సెస్ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు.


Also Read: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం