What happened to singer Kalpana Raghavendar and who is her husband?: గాయని కల్పనా రాఘవేందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆమె భర్త ప్రభాకర్ (Singer Kalpana Husband Name)ను అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది? ఏమైంది? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆయనను ఇంటికి తీసుకు వెళ్లి విచారణ చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
కల్పన భర్త ప్రభాకర్ మీద అనుమానం!?
కల్పనా రాఘవేందర్ సూసైడ్ అటెంప్ట్ కేసులో ఆవిడ భర్త ప్రభాకర్ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల సైతం ఆ దిశగా విచారణ మొదలు పెట్టి విచారణ వేగవంతం చేశారు. కల్పన భర్తను తీసుకొని వారి ఇంటికి వెళ్ళిన పోలీసులు అక్కడ మరోసారి తనిఖీలు చేపట్టారు.
రెండు రోజులుగా ఇంట్లో లేనన్న భర్త!
రెండు రోజులుగా తాను ఇంటిలో లేనని, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లినట్లు పోలీసులకు కల్పన భర్త ప్రభాకర్ తెలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం అందుతోంది. చెన్నై ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం పని ఉంది? ప్రభాకర్ చెప్పిన సమాధానాలు నిజమా? కాదా? అనేది వెరిఫై చేయనున్నారు.
ఐదేళ్లుగా అదే విల్లాలో నివాసం...
విల్లా సెక్రటరీకి సమాచారం ఇచ్చిన భర్త!
గాయని కల్పనా రాఘవేందర్, ప్రభాకర్ దంపతులు హైదరాబాద్ నగరంలోని నిజాంపేట ఏరియాలో గల వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో నివాసం ఉంటున్నారు. విల్లా సెక్రటరీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
మంగళవారం (ఫిబ్రవరి 4వ తేదీ) సాయంత్రం 4:30 గంటలకు కల్పన భర్త ప్రభాకర్ నుంచి వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీకి ఫోన్ వచ్చింది. సీసీ కెమెరాలు పరిశీలించిన ప్రభాకర్ సహాయం కోరుతూ ఫోన్ చేశారని వెంకట్ రెడ్డి తెలిపారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కల్పన ఇంటికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు... డోర్లు పగలగొట్టి స్థితిలో ఉన్న కల్పనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Also Read: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
ఐదేళ్లుగా కల్పనా రాఘవేందర్, ప్రభాకర్ దంపతులు వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో నివాసం ఉంటున్నారని సెక్రటరీ వెంకట్ రెడ్డి తెలిపారు. భార్య భర్తల సత్సంబంధాలు ఉన్నాయని, చాలా మంచిగా మాట్లాడే వారిని ఆయన తెలిపారు. వారిద్దరి మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేదో? తమకు తెలియదని వివరించారు. ఇళ్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగితే కల్పన తప్పకుండా హాజరు అయ్యే వారిని ఆయన స్పష్టం చేశారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి?
భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉంటే కల్పన ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటి? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల ఆవిడ బలవన్మరణానికి పాల్పడ్డారా? సింగింగ్ కెరీర్ పరంగా వృత్తిపరమైన జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేయాలని భావిస్తున్నారట. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన కల్పన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై వైద్యులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?