Writer Paruchuri Venkateswara Rao Grandson Sudarshan Debut Movie Launch: పరుచూరి సోదరుల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు. నటులుగా సైతం రాణించారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ నుంచి ఒక హీరో వస్తున్నారు. ఆ సినిమా ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ నగరంలో జరిగింది.


'సిద్ధాపూర్‌ అగ్రహారం' సినిమాతో పరుచూరి సోదరుల్లో పెద్దవారైన వెంకటేశ్వరరావు (Paruchuri Venkateswara Rao) మనవడు పరుచూరి సుదర్శన్ (Paruchuri Sudarshan) కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. రాకేష్‌ శ్రీపాద దర్శకత్వంలో వాసు తిరుమల, ఉష శివకుమార్‌ నిర్మిస్తున్న చిత్రమిది.
 
చిత్ర ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయడంతో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకుడు బి. గోపాల్‌ క్లాప్‌ ఇచ్చారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందజేశారు. 


''ఈ చిత్రం సుదర్శన్‌కు యాక్టర్‌గా మంచి జీవితాన్ని ప్రసాదించాలి. అద్భుతమైన కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. 'ప్రతిధ్వని'లో నేను రాజకీయంపై చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుదర్శన్‌ చెబుతుంటే నా ఒళ్లు పులకరించింది. అన్నగారి ఎత్తు (ఎన్టీ రామారావు), సుదర్శన్‌ ఎత్తు ఒకటే. ఆయనంత స్థాయికి ఎదిగే ప్రయత్నం సుదర్శన్‌ చేయాలని, కష్టపడాలని కోరుకుంటున్నాను'' అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.


Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్


ఈ కార్యక్రమంలో దర్శకులు వీఎన్‌ ఆదిత్య, వీరూ పొట్ల తదితరులు అతిథులుగా, రచయిత వై. అనుదీప్, ఛాయాగ్రహకులు శివారెడ్డి సవనమ్‌ పాల్గొన్నారు.


Also Read: చీకటిని వణికించే అస్త్రం, వెయ్యి నందుల బలం - 'బ్రహ్మాస్త్ర'లో అనీష్ శెట్టిగా కింగ్ నాగార్జున