పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మస్త్ర'లో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆయన అనీష్ శెట్టి పాత్రలో కనిపిస్తారని నేడు చిత్ర బృందం వెల్లడించింది. నాగార్జున ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది.
''సహస్త్ర నందిమ్ సామర్థ్యం
హే నంది అస్త్రం!
ఖండ్ ఖండ్ కురు
మం సహాయకం మం సహాయకం''
అని 'బ్రహ్మాస్త్ర' బృందం పేర్కొంది. సినిమాలో నాగార్జున నంది అస్త్రంగా కనిపించనున్నారు. నంది అస్త్రానికి చీకటి సైతం వణుకుతుందని, దానికి వెయ్యి నందులు బలం ఉంటుందని కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న విడుదల కానుంది.
Also Read: 'కెజియఫ్'లో రాకీ భాయ్, 'సలార్'తో ఎన్టీఆర్ సినిమా చేస్తే?
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమాను దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. తెలుగు 'బ్రహ్మాస్త్రం'గా విడుదల కానుంది. సెప్టెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్