యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లో కూడా అభిమానులు ఉన్న అతి కొద్ది మంది యువ కథానాయకులలో శ్వరానంద్ (Sharwanand) ఒకరు. తెలుగు ప్రేక్షకులు అంతా ఆయనను తమ వాడు అనుకున్నారు. ఓన్ చేసుకున్నారు. అందుకు కారణం శర్వా చేసిన సినిమాలే. 


కంటెంట్ బేస్డ్ కమర్షియల్ సినిమాలు, న్యూ ఏజ్ ఫిలిమ్స్ చేశారు శర్వానంద్. ఈ యంగ్ హీరోకి బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉంది. అదే సమయంలో యాక్షన్ ఇమేజ్ కూడా ఉంది. ఏ రోల్ చేసినా సరే... దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయగల ఛార్మింగ్ హీరో శర్వా. ఈ శుక్రవారం (జూన్ 7న) 'మనమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమా చూసిన నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆయనకు ఓ ట్యాగ్ ఇచ్చారు. అదే 'ఛార్మింగ్ స్టార్'


'మనమే' నుంచి శర్వానంద్ 'ఛార్మింగ్ స్టార్'
Sharwanand is Charming Star now: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' చిత్రాన్ని నిర్మించారు టీజీ విశ్వ ప్రసాద్. ఈ నెల 7న విడుదల కానుంది. ఆల్రెడీ సినిమా చూసిన విశ్వ ప్రసాద్ సినిమా విజయం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అంతే కాదు... కంటెంట్, అందులో శర్వానంద్ ఛార్మింగ్ లుక్స్ & ఆ పెర్ఫార్మన్స్ చూసి ఫిదా అయ్యారు. దాంతో ఆయన శర్వాకు 'ఛార్మింగ్ స్టార్' అని ట్యాగ్ ఇచ్చారు. 'మనమే' నుంచి ఆ ట్యాగ్ శర్వా పేరుకు ముందు టైటిల్ కార్డుల్లో పడుతుంది.


Also Read: 'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?






'మనమే' సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ తనకు నచ్చాయని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఆ రెండిటి కంటే ఎక్కువగా శర్వానంద్ ఛార్మింగ్ లుక్స్, ఆ నటన ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. అదీ సంగతి! ఇప్పటి వరకు శర్వాను ప్రామిసింగ్ స్టార్ అని కొందరు పేర్కొనేవారు. వెర్సటైల్ యాక్టర్ అని ఇంకొందరు అన్నారు. నటుడిగా, కథానాయకుడిగా శర్వా ప్రయాణంలో 35వ సినిమా 'మనమే' నుంచి ఆయన 'ఛార్మింగ్ స్టార్' అవుతున్నారు. సాధారణంగా ఇటువంటి ట్యాగ్స్, పొగడ్తలకు శర్వానంద్ దూరం. కానీ, విశ్వ ప్రసాద్ సహా అభిమానుల కోరిక మేరకు ఆయన ఓకే అన్నారని తెలిసింది.


Also Read: పెళ్లైతే హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలి, ట్రెండ్ మారింది - 'సత్యభామ' ఇంటర్వ్యూలో కాజల్ కామెంట్స్


'మనమే' సినిమాకు ఆల్రెడీ మంచి టాక్ వచ్చింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది కాకుండా శర్వానంద్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా, 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరొక సినిమా స్టార్ట్ చేశారు. దర్శకులు సంకల్ప్ రెడ్డి, సంపత్ నందితో చర్చలు జరుగుతున్నాయి.