Suhana Khan Buys Farmland In Alibaug: సుహానా ఖాన్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ముద్దుల కూతురు. సినీ అభిమానులకు, నెటిజన్లు ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. ఈ బ్యూటీ 'ది ఆర్చీస్' మూవీ ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతో అభినయంతో మెప్పించింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.


రూ. 9.5 కోట్లతో వ్యవసాయ భూమి కొనుగోలు


సుహానా ఖాన్ సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వ్యవసాయం భూముల మీద పెద్ద మొత్తంలో వెచ్చిస్తోంది. తాజాగా ముంబై సమీపంలోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్‌ థాల్ లో ₹9.5 కోట్లకు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి 7,8361 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూమి లావాదేవీ కోసం సుహానా రూ.57 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13, 2024న ఆమె ఈ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.   


గత ఏడాది ఇదే ప్రాంతంలో 1.5 ఎకరాల భూమి కొన్న సుహానా   


గత ఏడాది కూడా సుహానా ఖాన్ ఇదే ప్రాంతంలో వ్యవసాయం భూమిని కొనుగోలు చేసింది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో మూడు నిర్మాణాలతో కూడిన వ్యవసాయ భూమిని రూ.12.91 కోట్లతో దక్కించుకుంది. థాల్ గ్రామానికి వెళ్లాలంటే అలీబాగ్ పట్టణం నుంచి సుమారు 12 నిమిషాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. షారుఖ్ ఖాన్‌కు ఇదే ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ బంగ్లాను నిర్మించారు.


అంతేకాదు, విశాలమైన స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్‌ కూడా ఇందులో ఉన్నాయి. సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న ఈ భూమిని షారుఖ్ చాల కాలం క్రితమే తీసుకున్నారు. ఇదే ప్రాంతంలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ప్రాపర్టీలు ఉన్నాయి. అలీబాగ్‌లోని బంగ్లాలు ఒక ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. వాటి ధర ప్రదేశాన్ని బట్టి రూ.8 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ సీ బ్రిడ్జ్ సెవ్రీని నవా షెవాను కలుపుతూ అలీబాగ్‌కు రోడ్డు కనెక్టివిటీ బాగా పెరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో భూముల విలువ భారీగా పెరిగింది.   


‘ది ఆర్చీస్‌‘తో వెండి తెరకు పరిచయం


ఇక సుహానా ఖాన్  ఇటీవల జోయా అక్తర్ ‘ది ఆర్చీస్‌‘తో వెండి తన అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో దివంగత శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య కూడా నటించారు. ‘ది ఆర్చీస్‘  థియేట్రికల్ విడుదలకు బదులుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.


Read Also: అక్కడ మందు గ్లాస్, ఇక్కడ ప్లేట్ - ‘యానిమల్’ పాటకు అల్లు అర్హ క్యూట్ స్టెప్స్!