Allu Arha Animal Movie Jamal Kudu Dance: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఫన్నీ ముచ్చట్లు తరచుగా నెట్టింట వైరల్ అవుతుంటాయి. తన కూతురితో బన్నీ చేసే అల్లరి మామూలుగా ఉండదు. చాలా సార్లు కూతురితో కలిసి బన్నీ చేసే హంగామాకు సంబంధించిన  వీడియోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. వయసు చిన్నదే అయినా, సోషల్ మీడియాలో ఆమెకు ఓ రేంజిలో గుర్తింపు లభించింది. ఎప్పుడూ ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. తాజాగా అల్లు అర్హ ‘యానిమల్’ సినిమాలోని పాటకు వేసిన స్టెప్పులు అందరినీ ఆట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆమె ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే?


‘జమల్‌కుడు’ పాటకు అల్లు అర్హ క్యూట్ స్టెప్పులు


రీసెంట్ గా రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘జమల్‌కుడు’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. మందు గ్లాస్ నెత్తిన పెట్టుకుని బాబీ డియోల్ వేసిన స్టెప్పులు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ పాటకు నెటిజన్లు జోరుగా రీల్స్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమలోని క్రియేటివిటీని చూపించుకున్నారు. ఇప్పుడు అదే పాటకు అర్హ కూడా క్యూట్ క్యూట్ స్టెప్పులే వేసి ఆకట్టుకుంది. కానీ, అర్హ తలమీద గ్లాస్ తో కాకుండా ప్లేట్ పెట్టుకుని నడుచుకుంటూ వస్తూ స్టెప్పులు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చిన్నారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. బన్నీ కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.   






‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపై సందడి


అల్లు అర్హ ఇప్పటికే వెండి తెరపై కనిపించి ఆకట్టుకుంది. సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఈ మూవీలో తన ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తర్వాత అర్హ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. కానీ, తాజాగా సోషల్ మీడియా ఆమె ‘దేవర’ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ చిత్రంలో హీరోయిన్ చిన్న నాటి పాత్రను అర్హ పోషించినట్లు టాక్ వినిపించింది. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె నటనకు గాను నిమిషానికి రూ. 2 లక్షలు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అర్హను తండ్రికి తగ్గ తనయ అంటూ కూడా నెటిజన్స్ తెగ ప్రశంసించారు కూడా. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ‘దేవర‘ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది.


Read Also: ఎన్‌‌టీఆర్, అల్లు అర్జున్‌తో తలపడాలని ఉంది - బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ వింత కోరిక