Mounika Reddy Baby Bump Photos Viral: హీరో మంచు మ‌నోజ్ తండ్రి కాబోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయన తన అత్త‌, దివంగ‌త నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున అంద‌రితో పంచుకున్నారు. తాజాగా ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేశారు. ఈ పిక్స్‌లో మౌనిక బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్నారు. ఈ ఫొటోలకు మంచు మనోజ్ లవ్లీ రిప్లై ఇచ్చారు.


నువ్వంటే ప్రాణం: మనోజ్ రిప్లై


మౌనిక ఇన్‌స్టా పోస్ట్‌లో మంచు మ‌నోజ్ వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ఉండ‌గా.. మౌనిక ప్యూర్ బ్లాక్ డ్రెస్ లో క‌నిపించారు. ఈ పోస్టుకు మనోజ్ రిప్లై కూడా ఇచ్చారు. ‘‘పిల్లా ఓ పిల్లా.. నవ్వవంటే నాకు ప్రాణమే’’ అని కామెంట్ చేశారు. ఈ పోస్ట్ చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.


అంద‌రి ఆశీస్సుల‌తో తాము త‌ల్లిదండ్రులు కాబోతున్నామ‌ని, భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మ‌ళ్లీ తాత‌య్య‌, అమ్మ‌మ్మ అవుతున్నార‌ని, ధైర‌వ్ అన్న కాబోతున్నాడ‌ని గ‌తంలో ట్వీట్ చేశారు మంచు మ‌నోజ్. 






మార్చిలో పెళ్లి.. 


మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది మార్చి 3న వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. వివాహానికి ముందు నుంచి వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఇక మంచు మనోజ్, మౌనికా రెడ్డి... ఇద్దరికీ ఇది రెండో వివాహమే. దివంగత రాజకీయ నాయకులు భూమా నాగి రెడ్డి, భూమా శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. మనోజ్ తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణు, సోదరి లక్ష్మీ.. మౌనిక అక్క అఖిలప్రియ, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి.. ఇరువురి కుటుంబ సభ్యుల నడుమ, వాళ్ళ ఆశీసులతో ఘ‌నంగా వీరిద్ద‌రి పెళ్లి జరిగింది. మౌనికా రెడ్డికి ఇది రెండో సంతానం. ఆల్రెడీ ఆమెకు ఓ బాబు ఉన్నారు. 


'ఉస్తాద్' షోలో మంచు మ‌నోజ్.. 


దాదాపు కొన్నేళ్లుగా మంచు మ‌నోజ్ వెండి తెర‌పై క‌నిపించ‌లేదు. సినిమాలు తీయ‌లేదు. అయితే, పెళ్ల‌య్యాక సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెడ‌తార‌నే వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ, బుల్లితెర‌లో మాత్రం ర‌ఫ్ ఆడిస్తున్నాడు మ‌నోజ్. 'ఉస్తాద్' ప్రోగ్రామ్‌కు ఆయ‌న యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక మ‌ళ్లీ ఇప్పుడు రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. వాటిలో ఒకటి ‘వాట్ ది ఫిష్’. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘అహం బ్రహ్మస్మి’ అనే మరో సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మంచు మనోజ్ మళ్లీ తెరమీద కనిపించలేదు.


Also Read: ఇది మంచిది కాదు మానుకో, ఎక్స్ ట్రాలు చేసిన మీమ‌ర్‌కు సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్