Sundeep kishan Warning To Memer: మీమ్స్,  ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ప్ర‌తీది డ‌బుల్ మీనింగ్ అయిపోయింది. మాములు విష‌యాల‌ను కూడా డ‌బుల్ మీనింగ్ గా మార్చేసి జోకులు పేలుస్తున్నారు. అదే ఎదురైంది హీరో సందీప్ కిషన్ కి కూడా. 'ఊరు పేరు భైరవ కోన' సినిమాకి సంబంధించి మీమర్స్ తో ఏర్పాటు చేసిన మీట‌ప్ లో ఒక కుర్రాడు ఎక్స్ ట్రాలు చేశాడు. హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్, సందీప్ కిష‌న్ ని డ‌బుల్ మీనింగ్ వ‌చ్చేలా ప్ర‌శ్న‌లు అడిగాడు. దీంతో అత‌నిపై సందీప్ కిష‌న్ సీరియ‌స్ అయ్యాడు. కానీ, కోపం వ‌చ్చిన విష‌యాన్ని తెలియ‌కుండా ఆ మీమ‌ర్ కి న‌వ్వుతూనే.. స్వీట్ గా, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 


మీ భూమి మాకు రాసిస్తారా? 


ఈ మ‌ధ్య‌కాలంలో సినిమా ప్ర‌మోష‌న్స్ కి మీమ‌ర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నాయి సినిమా టీమ్స్. వాళ్ల‌తో స్పెష‌ల్ ఇంట‌రాక్ష‌న్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలానే 'ఊరు పేరు భైర‌వ కోన' సినిమా టీమ్ కూడా మీమ‌ర్స్ తో ఇంట‌రాక్ష‌న్ పెట్టింది. దాంట్లో భాగంగా మీమ‌ర్స్ అంద‌రూ త‌మ‌కు తోచిన ప్ర‌శ్న‌ల‌కు అడిగారు మూవీ టీమ్ ని. అయితే, మామా మ‌హేశ్ అనే కుర్రాడు మాత్రం డ‌బుల్ మీనింగ్ ప్ర‌శ్న‌లు అడిగాడు. "మీ పేరు భూమి క‌దా? మీ భూమి మాకు రాసిస్తారా?"  లాంటి ప్ర‌శ్న‌ల‌కు వేయ‌డంతో హీరోయిన్ వ‌ర్ష బొల్లం స‌మాధానం చెప్పేందుకు కొంచెం ఇబ్బందిప‌డ్డారు. "ఆ ఛాన్స్ లేదు వేరే వాళ్ల‌కి ఇచ్చేశాను" అంటూ ఆమె స‌మాధానం చెప్పారు.


సందీప్ స్వీట్ వార్నింగ్.. 


ఆ త‌ర్వాత సందీప్ కిష‌న్ తో మాట్లాడాడు ఆ కుర్రాడు. "సినిమాలో హీరోయిన్ తో అలా చేశారు క‌దా? ఎలా అనిపించింది? ఇద్ద‌రు హీరోయిన్ల‌తో చేశారు క‌దా? ఏ హీరోయిన్ తో బాగా అనిపించింది? ఏ హీరోయిన్ తో ఎక్కువ ఎంజాయ్ చేశారు?" అంటూ డ‌బుల్ మీనింగ్ అర్థం వ‌చ్చేలా క్వ‌శ్చ‌న్స్ అడిగాడు. దీంతో అప్ప‌టికే ఆ కుర్రాడిపై చిర్రెత్తి ఉన్న సందీప్ కిష‌న్ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘ఈ క్వ‌శ్చ‌న్ కి నేను స‌మాధానం చెప్ప‌ను. కొన్ని జోక్ గా చెప్పినా కూడా డ‌బుల్ మీనింగ్ అవుతాయి. స్టేజ్ మీద చెప్ప‌ను. వేరే క్వ‌శ్చ‌న్ అడుగు చెప్తాను" అని క‌ట్ చేశాడు. అయినా ఆ కుర్రాడు మ‌ళ్లీ మ‌ళ్లీ అలాంటి ప్ర‌శ్న‌లే వేయ‌డంతో సందీప్ ఇలా అన్నారు. "నీ మాతృభాష ఏంటి? తెలుగులో న‌టించ‌డం అనే ప‌దం ఉంటుంది. యాక్టింగ్ ఎవ‌రితో బాగా చేశారు అని అడుగు. ఇలాంటి అల‌వాటు స్టార్ట్ చేసుకోవ‌ద్దు. ఇలా డ‌బుల్ మీనింగ్ గా అడ‌గ‌కు. నేను వ‌ద్దంటున్నా అడుగుతున్నావు. ఇది మంచిది కాదు మానుకో" అంటూ వార్నింగ్ ఇచ్చాడు సందీప్ కిష‌న్. దీంతో "సందీప్ భ‌య్యా.. భ‌లే చెప్పావు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


సందీప్ కిష‌న్, వ‌ర్ష బొల్లం, వైవా హ‌ర్ష‌, కావ్య‌థాప‌ర్ న‌టించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమా ఫిబ్ర‌వ‌రి 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఫస్ట్‌ షో నుంచే పాజిటిటవ్‌ రివ్యూస్‌ తెచ్చుకుంది. దీంతో ఎన్నో రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిష‌న్ కి ఈ సినిమా ఊర‌టను ఇచ్చింద‌నే చెప్పాలి. ఇక ఈ సినిమాకి విఐ ఆనంద్ దర్శకత్వం వ‌హించారు.


Also Read: ఆ హీరోల సినిమాలకు రివ్యులు ఇవ్వొద్దు, పాడుచేయొద్దు: అభినవ్ గోమఠం