Kalki Team Clarifies Movie Postponed Rumours: టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' ఒకటి. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్లాసిక్ హిట్ 'మహానటి' తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రభాస్-అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. టైం ట్రావెలర్ థిమ్‌తో రాబోతున్న ఈ సినిమాకు నాగ్ అశ్వీన్ విజన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా? అని మూవీ లవర్స్ అంతా అంచనాలు వేసుకుంటున్నారు.
పైగా వినిపిస్తున్న వార్తలు, బయటకు వస్తున్న అప్‌డేట్స్ మూవీపై మరింత హైప్ క్రియేట చేస్తున్నాయి. దీంతో కల్కీ నుంచి వస్తున్న ఎలాంటి అప్‌డేట్ అయినా క్షణాల్లో ట్రెండీంగ్‌కి వచ్చేస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాల్సి ఉండగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పెండింగ్ కారణంగా వాయిదా పడింది. మూవీ రిలీజ్‌పై రకరకాలు పుకార్లు వినిపిస్తున్న క్రమంలో మే 9న కల్కీ విడుదలను ఫిక్స్ చేస్తూ ఇటీవలె మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్‌పై కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని, మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.
మే 9న టా టక్కర టక్కరే..
మూవీ మళ్లీ వాయిదా అని, మే 9న కల్కీ విడుదల కష్టమేనంటూ ఒక్కసారిగా టూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఫ్యాన్స్, ఆడియన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. పదే పదే మూవీని వాయిదా వేయడమంటూ కొందరు ఫ్యాన్స్ మూవీ టీంపై మండిపడుతుంది. ఈ క్రమంలో అందరి కన్‌ఫ్యూజన్ తీసేసి, ఫ్యాన్స్‌ని కూల్ చేస్తూ తాజాగా వైజయంతి మూవీస్ ఓ ప్రకటన వదిలింది. ఈ సందర్భంగా ప్రభాస్‌కు సంబంధించిన గ్లింప్స్ వదిలి రూమర్స్‌కు చెక్ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్‌తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంటే కల్కీ మే 9న రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టక్కరా టక్కరే అంటూ ఆడియన్స్‌లో మరింత జోష్ నింపింది మూవీ టీం. 'కల్కి 2989 ఏడీ' చిత్రాన్ని రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించిన సమయంలో సంక్రాంతికి విడుదల కాదని ప్రేక్షకులకు సైతం అర్థమైంది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కల్కి' సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్, దీపిక నటిస్తున్న తొలి చిత్రమిది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'లోఫర్'... హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 ఏడీ' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.