Kiara Comments At Ideas Of India: బాలీవుడ్‌, టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ప్రస్తుతం తెలుగులో రామ్‌ చరణ్‌ సరసన 'గేమ ఛేంజర్‌'లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌లోనూ పలు సినిమాతో బిజీగా ఉంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలు, పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్ గా రాణిస్తున్న ఆమె తను ఈ స్థాయికి అంతా ఈజీ రాలేదని చెప్పింది. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం ముంబాయిలో 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్' కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ మీడియా సంస్థ ABP Network ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్ని తమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు.


శుక్రవారం(ఫిబ్రవరి 23న) ప్రారంభమైన ఈ షోలో బాలీవుడ్‌కు చెందిన నిర్మాతలు, స్టార్‌ నటీనటులు పాల్గొన్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన 'ది అవుట్‌సైడర్స్ అప్‌హిల్ బ్యాటిల్' అనే సెషన్‌లో కియారా మోడరేటర్, ప్రముఖ రచయిత చేతన్ భగత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కియారా ఇండస్ట్రీలో మహిళ నటీనటులు ఎదుర్కొనే అసమానతలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫీమెల్‌ యాక్టర్‌గా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనభవాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నటిగా నేను సాధించిన దానికి కృతజ్ఞతా వైఖరితో ఉన్నాను. కానీ ఇదంత ఒక్క రాత్రిలోనే జరగలేదు.


కియారా అద్వానీగా గుర్తింపు పొందడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఈ  జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. అవమానాలు పడ్డాను. నటిగా ఎన్నో రిజెక్షన్‌, గెలుపు-ఒటములు చూశాను. అయినా వాటిన్నింటిని నిలదొక్కుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. గెలుపు వస్తే పొంగిపోలేదు, ఒటమి చూసి నిరాశ పడలేదు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్‌ చేయాలో నేర్చుకున్నాను. వాటిని అదిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుసుకున్నాను. ఏం జరిగినా వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నా. జీవిత విద్యార్థిగా నేను ఎప్పుడు ఎదోక విషయం నుంచి నేర్చుకుంటూనే ఉంటాను. అదే నన్ను ఈ రోజు ఇలా మీ ముందు నిలబెట్టిందని నమ్ముతాను" అంటూ చెప్పుకొచ్చింది. 


అధికారం, గుర్తింపు ఉన్న మహిళలకు అన్నీ లాభిస్తాయి?


కియార మాటలు విన్న రచయిత చేతన్‌ భగత్‌ ఆమెను ఇలా ప్రశ్నించారు. పవర్‌ లేదా స్టేటస్‌ ఉన్న మహిళ అన్నింటిలో రాణిస్తుందని, ఆమెకు అన్నివిధాలుగా అందుబాటులో అవకాశాలు ఉంటాయని పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి అన్నారు, మీరు ఏమో ఇలా మాట్లాడుతున్నారంటూ ఈ సందర్భంగా చేతన్‌ భగత్‌ కోట్‌ చేశారు. దీనికి కియార స్పందిస్తూ ఇలా సమాధానం ఇచ్చింది. మీరు ఎదైతే ఇంద్రనూయిని ఎక్సాంపుల్‌గా తీసుకున్నారో అదీ నేను ఏకిభవిస్తాను. ఏదేయితే ఇంద్రనూయి చెప్పారో దానికి ఆమె గొప్ప ఉదాహరణ. అదీ నేను కూడా నమ్ముతాను.  తల్లిగా, భార్యగా, ఉండి ఒక కంపెనీ సీఈవోగా వ్యవహరించడమంటే సాధారణ విషయం కాదు.


ఆమె ఆ రెండింటిని బ్యాలెన్స్‌ చేశారు. ఈ విషయంలో ఆమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి. అదే సమయంలో దానివల్ల ఎదురయ్యే అసమానాతలను కూడా ద్రష్టిలో పెట్టుకోవాలి. ఒక మహిళా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను లీడ్‌ చేస్తుందంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుందని, ఇది పురుషుల కంటే ఎక్కువ కష్టమైనదనే వాస్తవాన్ని గ్రహించాలి. స్ట్రీ ఎంత ఎత్తుకు వెళ్లిన పురుషులు, స్ట్రీలకు మధ్య తేడాను చూస్తూనే ఉంటారు. నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ తేడా అనేది పని చేసే ఆడవాళ్లకు, ఒక గ్రహిణికి ఒకేలా ఉంటుందని మీకు తెలుసా?" అంటూ కియారా వివరణ ఇచ్చింది.