Sai tej helps two children for their treatment : ఇతరులకు సాయం అందించే హీరోల్లో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే పలుమార్లు తన గొప్ప మనసును చాటుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్న తేజు, గతంలో ఒక ఫిలిం జర్నలిస్ట్ ఆపదలో ఉంటే, రూ.లక్షల్లో ఆర్థిక సహాయం అందించాడు. వివిధ పరిస్థితులలో అభిమానులను కూడా ఆదుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఈసారి ఇద్దరు చిన్నారులకు సాయం అందించి నెటిజన్స్ నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.


చిన్నారుల ట్రీట్మెంట్ కి సాయం అందించిన మెగా హీరో


సాయి ధరంతేజ్ తాజాగా ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కి హెల్ప్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రు బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు తెలిసిన ఒక అనాధ శరణాలయం నుండి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కి సాయం కావాలంటూ ఫోన్ రావడంతో వెంటనే సాయి ధరమ్ తేజ్ కి మెసేజ్ పెట్టగా తేజు వెంటనే రెస్పాండ్ అయి సాయం అందించారట. ఇదే విషయాన్ని ఆండ్రు బాబు తెలియజేస్తూ 'లవ్ యు తేజు' అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా సాయి తేజ్ చేసిన సాయానికి కృతజ్ఞతగా సదరు ఆర్ఫనైజ్ పిల్లలు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోని కూడా పంపించారు. ఆ వీడియోను సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు తన ట్వీట్ కి జత చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నేటిజన్స్ సాయి తేజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






 'విరూపాక్ష'తో కం బ్యాక్


యాక్సిడెంట్ కి ముందు సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్', 'రిపబ్లిక్' వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఊహించని విధంగా సాయి తేజ్ కి యాక్సిడెంట్ జరిగింది. దాంతో సినిమాలకు కొన్ని నెలల గ్యాప్ తీసుకున్నాడు. యాక్సిడెంట్ నుంచి రికవరీ అయిన తర్వాత 'విరూపాక్ష' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సాయి తేజ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


సాయి తేజ్ 'గాంజా శంకర్' కి నోటీసులు


సాయి తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ టైటిల్ గురించి ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. సినిమా టైటిల్ మార్చాలి అంటూ మూవీ టీమ్‌కు నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులను హీరోగా నటించిన సాయి ధరమ్ తేజ్‌తో పాటు నిర్మాత అయిన నాగవంశీకి, దర్శకుడు అయిన సంపద్ నందికి కూడా పంపించింది. కాగా 'గాంజా శంకర్' టీమ్ ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.


Also Read : 9 భాగాలుగా 'కల్కి 2898 AD' - ప్రభాస్ సినిమాపై కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు!