Lokesh Kanagaraj Rajinikanth Movie: 'లియో' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అంత కంటే ముందు 'విక్రమ్'తో ఇండస్ట్రీ హిట్ అందుకొని అగ్ర దర్శకుల సరసన చేరాడు. రీసెంట్ గా వచ్చిన లియో ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నా... కలెక్షన్స్ మాత్రం అదరగొట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్ల గ్రాస్ అందుకుని ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తమిళ చిత్రంగా నిలిచింది. 'ఖైదీ' మూవీతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్... ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నాడు.


'Thalaivar 171' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ప్రస్తుతం లోకేష్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాలో ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను లోకేష్ సంప్రదించారట. అయితే బాలీవుడ్ హీరో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' తో పాటూ 'బ్రహ్మాస్త్ర' లాంటి సినిమాల్లో షారుఖ్ అతిధి పాత్రలు పోషించాడు. కానీ ఆ సినిమాల్లో అతడి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు.


సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రలో కనిపించినా... ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకునే రజనీకాంత్ సినిమాలో అతిధి పాత్రలో నటించేందుకు షారుఖ్ ఆసక్తి కనపరచలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ లోకేష్ కనగరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో నేరుగా ఓ సినిమాలో నటించాలని షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇటీవలే కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయిన అట్లీతో 'జవాన్' సినిమా చేసి భారీ సక్సెస్ అందుకున్న షారుక్ ఇప్పుడు లోకేష్ తో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో షారుక్ తో లోకేష్ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'డంకీ' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు టీఈ జ్ఞానవేల్ రాజాతో ఓ సినిమాను చేస్తున్నారు. ఆ చిత్రానికి 'వెట్టయన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ రీసెంట్ గా రజని బర్త్ డే కి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరోసారి రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, ఫాహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, అర్జున్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Read : బికినీలో మంచు లక్ష్మి ఐస్ బాతింగ్ - వీడియో వైరల్!