Manchu Lakshmi : టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, సినీ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి... పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లు చేస్తూ... మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 'అగ్ని నక్షత్రం' అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.


ఇటీవల బికినీలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది లక్ష్మీ మంచు. ఈ వయసులోనూ స్టార్ హీరోయిన్లకు తగ్గకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఆమె... తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో బికినీ వేసి మంచు గడ్డలో స్నానం చేసి మరోసారి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. గతంలో టాలీవుడ్ హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ ఫిన్ ల్యాండ్ దేశంలోని ఓ లొకేషన్ లో మంచలో ఉన్న కొలనులో బికినీ వేసుకుని దిగి స్నానం చేసి వచ్చారు. ఆ వీడియోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరు హీరోయిన్లు గడ్డ కట్టిన మంచులో బికినీ వేసుకొని మరీ ఐస్ బాతింగ్ చేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.


మంచు లక్ష్మి కూడా అదే చేసింది. రకుల్, ప్రగ్యా జైస్వాల్ ఐస్ బాతింగ్ చేసిన సేమ్ లొకేషన్ ఫిన్ ల్యాండ్ లోనే మంచు లక్ష్మి కూడా బికినీలో వెళ్లి గడ్డ కట్టిన మంచు మధ్యలో స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఏజ్ లోను మంచి లక్ష్మి ఇలాంటి సాహసాలు చేయడంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ మంచు లక్ష్మిని తెగ మెచ్చుకుంటున్నారు. మంచు లక్ష్మి బికినీలో అది కూడా గడ్డకట్టిన మంచులో ఐస్ బాతింగ్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ మంచు లక్ష్మి ఈ సాహసం చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటంటే క్రియో థెరపీ లో భాగంగా ఈ ఐస్ బాతింగ్ చేసినట్లు తెలుస్తోంది.


గతంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ క్రియో థెరపీ లో భాగంగా ఐస్ బాత్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో మంచు లక్ష్మి కూడా చేరడం విశేషం. నిజానికి రకుల్, ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి.. ఈ ముగ్గురూ కలిసే ఫిన్ ల్యాండ్ వెళ్లారు. అయితే రకుల్, ప్రగ్యా జైస్వాల్ తర్వాత మంచు లక్ష్మి ఇప్పుడు ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక మంచు లక్ష్మి నటిస్తున్న 'అగ్ని నక్షత్రం' సినిమా విషయానికొస్తే, ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతోంది. మోహన్ బాబు, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Read : సలార్ టికెట్స్ ఫ్రీగా ఇస్తా, యంగ్ హీరోకి సోషల్ మీడియాలో రిక్వెస్టుల మీద రిక్వెస్టులు