Bigg Boss Telugu Winners list:  బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తిచేసుకుంది. దాంతో పాటు ఒక ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ సీజన్ కూడా పూర్తిచేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 కూడా చివరిదశకు చేరుకుంది. దీంతో మునుపటి సీజన్స్‌లో విన్నర్స్‌గా ఎవరు నిలిచారు అనే విషయాన్ని బిగ్ బాస్ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఎవరు చేరబోతున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సీజన్ 1
బిగ్ బాస్ రియాలిటీ షోలో మొదటి సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన చాలామంది ప్రేక్షకులకు సుపరిచితులే. దీంతో హౌజ్‌లో వారందరి ప్రవర్తన చూసి ఓట్లు వేశారు ప్రేక్షకులు. అప్పట్లో సోషల్ మీడియా అంత యాక్టివ్‌గా ఉండకపోవడంతో ప్రేక్షకుల నిర్ణయంపై ఎలాంటి ప్రభావం పడలేదు. మెజారిటీ ప్రేక్షకులు ఇష్టపడి.. యాక్టర్ శివబాలాజీని విన్నర్ చేయగా.. ఆదర్శ్ బాలకృష్ణ రన్నర్‌గా నిలిచాడు.


సీజన్ 2
బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్‌ను విన్నర్ చేయడానికి బిగ్ బాస్ ప్రేక్షకులంతా ఎంతో కష్టపడ్డారు. సింపథీ గేమ్‌తో చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న కౌశల్.. తనదైన స్ట్రాటజీతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఈ సీజన్‌లో 18 కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యి పూర్తిగా 112 రోజులు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్‌లో ఇదే ఎక్కువకాలం నడిచిన సీజన్. ఇక ఇందులో కౌశల్ విన్నర్ అవ్వగా.. గీతామాధురి రన్నర్‌గా నిలిచింది.


సీజన్ 3
అప్పటికే ప్లేబ్యాక్ సింగర్‌గా, ప్రైవేట్ ఆల్బమ్స్ క్రియేటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయ్యాడు. 105 రోజులు నడిచిన ఈ సీజన్‌లో శ్రీముఖి రన్నర్‌గా నిలిచింది. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు సీజన్స్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ రన్నర్స్‌గా నిలిచారు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రాహుల్ లైఫే పూర్తిగా మారిపోయింది.


సీజన్ 4
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయిన అభిజీత్.. బిగ్ బాస్ సీజన్ 4 ట్రోఫీని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్‌గా స్మార్ట్‌గా ఆడి విన్నర్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే చాలామంది బిగ్ బాస్ ఫ్యాన్స్.. అభిజీత్ పేరే చెప్తారు. 105 రోజులు నడిచిన ఈ సీజన్‌లో అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచాడు.


సీజన్ 5
బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. ఇందులో విన్నర్‌గా సన్నీ నిలిచాడు. విన్నర్‌గా సన్నీ బిగ్ బాస్ 5 ట్రోఫీని తన ఇంటికి తీసుకెళ్లగా రన్నర్ స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. విన్నర్ కావాల్సిన షన్ముఖ్.. తన లవ్ ట్రాక్ వల్ల అభిమానులను కోల్పోయి రన్నరప్‌గా నిలిచాడు.


సీజన్ 6
బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో కంటే సీజన్ 6లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కే ఎక్కువ పాపులారిటీ లభించింది. ఇప్పటికీ ఎవరికి వారు వారి కెరీర్‌లో బిజీ అయిపోయారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్స్ అన్నింటిలోకంటే సీజన్ 6లోనే అత్యధికమంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి వెళ్లారు. 21 కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ అయిన సీజన్ 6లో రేవంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. కానీ శ్రీహాన్ ప్రైజ్ మనీ తీసుకోవడం వల్ల రేవంత్‌కు ట్రోఫీ దక్కిందని.. లేకపోతే ఓటింగ్ విషయంలో తనే విన్నర్ అని నాగార్జున ప్రకటించారు. 


ఓటీటీ సీజన్ 1
బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీలో మాత్రమే ప్రసారం అవ్వడమనేది హిందీ నుంచే మొదలయ్యింది. దీంతో దానిని ఇన్‌స్పిరేషన్‌లాగా తీసుకొని తెలుగులో కూడా బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించారు మేకర్స్. ఇక ఈ బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ 1లో బిందుమాధవి విన్నర్‌గా నిలిచింది. తెలుగులో జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్స్‌లో విన్నర్ అయిన ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్‌గా రికార్డ్ సాధించింది బిందుమాధవి.


సీజన్ 7
ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీజన్ 7లో ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే హౌజ్‌లోకి రైతుబిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంతే విన్నర్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?