Bigg Boss Shivaji: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ ఇంకా ప్రసారం కాకపోయినా.. షూటింగ్ మాత్రం పూర్తయ్యింది. దీంతో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనే విషయాలపై సోషల్ మీడియాలో వార్తలు బయటికొస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో ముగ్గురు కంటెస్టెంట్స్.. ఇప్పటికే బయటికి వచ్చేశారని, హౌజ్‌లో కేవలం ముగ్గురే మిగిలారని వార్తలు వచ్చాయి. ఇక ఆ ముగ్గురిలో నుంచి కూడా ఒకరు ఎలిమినేట్ అయిపోయారని, అది కూడా శివాజీ ఎలిమినేట్ అయ్యారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫినాలే షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో విన్నర్, రన్నర్‌ల వివరాలు బయటకు లీకవుతున్నాయి.
నలుగురు ఔట్, ఆ ఇద్దరి మధ్య పోరు
బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే వీక్‌లోకి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. వారే అర్జున్, యావర్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్. అయితే ఈ ఆరుగురు టాస్కులు ఎంత బాగా ఆడినా.. ఎంత ఎంటర్‌టైన్ చేసినా.. ప్రేక్షకుల మద్దతు లేకపోతే బిగ్ బాస్ హౌజ్‌లో ఉండడం కష్టమే. అందుకే అందరికంటే ప్రేక్షకుల నుంచి మద్దతు ఎవరికి తక్కువగా ఉందో వారు ముందుగా ఎలిమినేట్ అయిపోయారు. అలా అర్జున్ ముందుగా టాప్ 6వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చేశాడు. టాప్ 5 స్థానాన్ని ప్రియాంక దక్కించుకుంది. ఆ తర్వాత యావర్ కూడా ఓట్ల శాతం తక్కువగా ఉండడంతో ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు శివాజీ కూడా ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివాజీ కూడా బయట రావడంతో ప్రశాంత్, అమర్ దీప్‌లో ఎవరు విన్నర్ అనే ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విన్నర్ అని తెలుస్తోంది.
తనే విన్నర్ అనుకున్నారు..
మొదట్లో శివాజీ ఆటతీరు చూసి తనే విన్నర్ అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అందరికంటే ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఓట్లు కూడా తనకే ఎక్కువగా పడ్డాయి. చాలా వారాలు నామినేషన్స్‌లో ఉన్నా.. ప్రతీ నామినేషన్‌లో అత్యధిక ఓటింగ్‌తో సేవ్ అయ్యేవాడు శివాజీ. ఇలాగే ఇంకొన్ని వారాలు కంటిన్యూ అయితే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అయిపోతాడని అనుకున్నారంతా. కానీ మెల్లగా ఆయన ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ముందులాగా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందించలేకపోయాడు. అందుకే ఓట్లు కూడా తగ్గిపోయాయి. విన్నర్ కాకపోయినా.. రన్నర్ అవుతాడేమో అనుకున్నారు. కానీ ఫైనల్‌గా టాప్ 3 స్థానాన్ని దక్కించుకొని ఇంటికి వెళ్లాడు.
మిగిలింది ఆ ఇద్దరే..
శివాజీ కూడా ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌజ్‌లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ మాత్రమే మిగిలారు. ఒక కామన్ మ్యాన్‌గా వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా ఫైనల్ వరకు చేరుకోలేదు. ఫైనల్ వరకు రావడం మాత్రమే కాదు.. పల్లవి ప్రశాంతే విన్నర్ అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. నెటిజన్లు తనకు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. పల్లవి ప్రశాంత్ సన్నిహితులే.. తనను చూసి గర్వంగా ఉందంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అని, అమర్‌దీప్ రన్నర్ అని అభిప్రాయం కలుగుతోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ రూమర్స్‌లో నిజమెంత ఉందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వేచిచూడాల్సిందే.
Also Read: ఐదుగురు హీరోయిన్లు, ఆరుగురు హీరోలు - 'బిగ్ బాస్' ఫినాలే మామూలుగా ఉండదు, 6 మినిట్స్ ప్రోమో ఇదిగో