బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(Jawan) జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కొనసాగుతూనే ఉంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై వారం గడుస్తున్నా మూవీ చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. సుమారు రూ 300 కోట్ల భారీ బడ్జెట్ తో షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా రిలీజ్ కు ముందు పాటలు, షారుక్ ఖాన్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ లో షారుక్ చెప్పిన కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయాయి.


ముఖ్యంగా అనిరుధ్ కంపోజ్ చేసిన సాంగ్స్ తెలుగులో అంతంత మాత్రంగానే ఉన్నా... హిందీ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. దీంతో ఫ్యాన్స్ రీల్స్ రూపంలో జవాన్ సాంగ్స్ ని రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జవాన్ క్రేజ్ ఎక్కడి వరకు వెళ్లిందంటే... సెలబ్రిటీలు సైతం జవాన్ సాంగ్స్ లోని సిగ్నేచర్ స్టెప్స్ ని రీ క్రియేట్ చేస్తూ రీల్స్ కూడా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ లో జవాన్ సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా షారుక్ లేడీ ఫ్యాన్ ఓ హాస్పిటల్ లో జవాన్ సాంగ్ కి డాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రిషా డేవిడ్ అనే ప్రొఫెషనల్ డాన్సర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది.


ఆసుపత్రిలో జవాన్ మూవీలోని 'చలేయా'(chaleya) పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ప్రిషా డేవిడ్. ఆ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'SRKకి వైద్యం చేసే శక్తి ఉంది' అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన షారుఖ్ ఆమె డాన్స్ కి ఫిదా అయి, ఆ వీడియోకి రిప్లై కూడా ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో షారుక్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేస్తూ... "ఇది చాలా బాగుంది. థాంక్యూ, మీరు త్వరగా కోలుకుని జవాన్ సినిమా చూడండి. అంతేకాదు మీరు హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక మరో డాన్స్ వీడియో చేయాలి. దాని కోసం నేను ఎదురు చూస్తాను. లవ్ యూ' అంటూ రాస్కొచ్చారు.


Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?






ప్రస్తుతం షారుఖ్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 'జవాన్'లోని ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచారు. హిందీ వర్షన్ 'చలేయా' పాటను ప్రముఖ సింగర్ అరిజిత్ సింగ్, శిల్పా రావు ఆలపించగా, కుమార్ ఈ పాటను రాశారు. తమిళ వెర్షన్ ని స్వయంగా అనిరుద్, ప్రియమాలి పాడగా, వివేక్ సాహిత్యం అందించారు. అలాగే తెలుగు వర్షన్ ని ఆదిత్య ఆర్కే, ప్రియామాలి ఆలపించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పాటను రాశారు. షారుక్ ఫ్రెండ్ ఫరాఖాన్ మూడు భాషల్లోనూ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేయడం విశేషం.


Also Read : స్కూల్ బుక్స్ సెట్‌కి తీసుకెళ్లి షారుఖ్ అంకుల్‌తో ఆడుకునేదాన్ని - 'జవాన్' చైల్డ్ ఆర్టిస్ట్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial