Balakrishna about HanuMan: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇంత తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే విజువల్స్‌ను అందించారని సినిమా చూసినవారు ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా సీనియర్ హీరో బాలకృష్ణ కూడా ‘హనుమాన్’ను చూశారు. చూసిన తర్వాత కాసేపు దర్శకుడితో సినిమా గురించి చర్చించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్.. బాలయ్య ‘హనుమాన్’ మూవీ చూసి, దర్శకుడితో మాట్లాడిన వీడియోను తమ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


అందరినీ ఆకర్షించారు..
‘‘టెక్నికల్‌గా చాలా బాగుంది. సినిమాలో చాలా కంటెంట్ ఉంది. చాలా బాగా హ్యాండిల్ చేశావు. కనువిందుగా, కన్నుల పండుగగా అనిపించింది. మంచి సినిమా ఇచ్చారు పండగకు. అంతా ఆంజనేయ స్వామి ఆశీస్సులు. నీ టేకింగ్ మీద నాకు నమ్మకం ఉంది. మనం కూడా అన్‌స్టాపబుల్ ట్రైలర్ చేశాము కదా. ఫిల్మ్ మేకింగ్‌ను ఎంజాయ్ చేయాలి. అదే ప్యాషన్ కనిపిస్తుంది. నేను నీ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. చాలా బాగుంది. నీ సైడ్ గురించే కాదు అందరూ బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ కంటే నిర్మాతే ముఖ్యం. ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు సినిమా తీయడానికి అంటే చాలా సపోర్ట్ ఉండాలి. అన్నీ క్రాఫ్ట్స్ పరంగా సినిమా చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఆడియన్స్‌లోని అన్ని సెక్షన్స్‌ను బాగా ఆకర్షించారు. మాయ చేశారు. సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ‘హనుమాన్’ చూసిన బాలకృష్ణ.. ప్రశాంత్ వర్మను ప్రశంసల్లో ముంచేశారు.






శివరాజ్ కుమార్ సపోర్ట్..
‘హనుమాన్’ సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆంజనేయ స్వామి గురించి చెప్తూ రామాయణ స్తోత్రాన్ని కూడా గుర్తుచేసుకున్నారు బాలకృష్ణ. తెలుగులో బాలకృష్ణ, కన్నడలో శివరాజ్ కుమార్‌లాంటి సీనియర్ హీరోలను ఈ సినిమా మెప్పించింది. వీరు సినిమా చూసి.. చాలా బాగుందని చెప్పడానికి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణతో కలిసి ప్రశాంత్ వర్మ పనిచేశాడు. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోను, దాని ట్రైలర్‌ను ప్రశాంత్ డైరెక్ట్ చేశాడు. అందుకే ఆ టేకింగ్‌ను గుర్తుపెట్టుకొని, ‘హనుమాన్’ కచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నానని బాలయ్య బయటపెట్టారు.


అన్ని భాషల్లో హిట్..
ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాదు.. విడుదలయిన అన్ని భాషల్లో ‘హనుమాన్’ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో అయితే ఇప్పటికే నాలుగు మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘హనుమాన్’కు పోటీగా మరెన్నో సినిమాలు సంక్రాంతి బరిలో దిగినా కూడా.. అన్నింటికంటే ఎక్కువగా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది ఈ మూవీ. ప్రశాంత్ వర్మ కాన్పిడెన్స్‌ను చూసి ఒకప్పుడు ట్రోల్ చేసినవారే.. ఇప్పుడు తనను ప్రశంసిస్తున్నారు. ఈ డైరెక్టర్ సృష్టించే సినిమాటిక్ యూనివర్స్‌ను ఎప్పుడెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయాలా అని ఎదురుచూస్తున్నారు.


Also Read: మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్‌కే ఆ ట్యాగ్ ఇస్తున్న హీరోయిన్లు - కేతికా కూడా ఆ మాట అనేసింది