Actress Anjali about Intimate Scenes: కొందరు హీరోయిన్లు స్క్రీన్‌పై ఇంటిమేట్స్ సీన్స్ చేయడానికి ఇష్టపడరు. చాలామంది హీరోయిన్స్‌కు ఆ పాలసీ ఉంటుంది. కానీ మరికొందరు మాత్రం యాక్టర్ అంటే ఏదైనా చేయాలి అనుకుంటారు. తాజాగా తెలుగమ్మాయి అంజలి కూడా రొమాంటిక్ సీన్స్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. తెలుగమ్మాయిగా సినిమాల్లో పరిచయమయినా కూడా ప్రస్తుతం ఇతర సౌత్ భాషల్లోనే బిజీగా గడిపేస్తోంది. ఎక్కువశాతం పక్కింటి అమ్మాయి పాత్రలు చేస్తూ.. గ్లామర్ రోల్స్‌కు, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటుంది అంజలి. దీంతో మేకర్స్ కూడా తనకు ఎక్కువగా అలాంటి పాత్రలు ఇవ్వడానికే ఇష్టపడతారు. ఇక రొమాంటిక్స్ సీన్స్‌పై తన అభిప్రాయాన్ని తాజాగా బయటపెట్టింది అంజలి.


కో స్టార్ గురించే ఆందోళన..


సినిమాల్లో ముద్దు సీన్స్ కామన్‌గా వస్తాయని, అందులో నటించక తప్పదని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది అంజలి. కానీ అలాంటి సీన్స్‌లో నటించే ఇబ్బంది గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇబ్బందిగా ఉన్నా కూడా కథ డిమాండ్ చేస్తే తప్పదని తెలిపింది. ముఖ్యంగా అలాంటి సీన్స్‌లో నటించేటప్పుడు తన కో స్టార్ తన గురించి ఏమనుకుంటాడో అని ఆందోళన కలుగుతుందని మనసులో మాట బయటపెట్టింది అంజలి. ఇంటిమేట్ సీన్స్ అనేవి సినిమాలో ఒక భాగం కాబట్టి, అవి కూడా సినిమాకు అవసరమే కాబట్టి వద్దని చెప్పడం కష్టమని తెలిపింది. రియల్ లైఫ్‌లో ఇద్దరు లవర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీకి, స్క్రీన్‌పై లవర్స్ మధ్య చూపించే కెమిస్ట్రీకి చాలా తేడా ఉంటుందని చెప్పింది. అందుకే ముద్దు సీన్స్‌లో నటించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని రివీల్ చేసింది.


పెళ్లి అంటూ రూమర్స్..
చాలాకాలంగా తమిళ నటుడు జైతో అంజలి ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి పెళ్లి గురించి చాలాసార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. కొన్నిరోజుల క్రితం కూడా అంజలి పెళ్లిపై రూమర్స్ వైరల్ అయ్యాయి. వాటిపై అంజలి సీరియస్ అయ్యింది. కొందరు తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని చెప్పుకొచ్చింది. గతంలో జైతో ప్రేమలో ఉన్నట్టుగా రూమర్స్ క్రియేట్ చేశారని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యిందని కూడా రూమర్స్ వచ్చాయని తెలిపింది. అవన్నీ రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడైనా ఆ రూమర్స్ చూసి నవ్వుకుంటాను కానీ సీరియస్‌గా తీసుకోను అని చెప్పింది.


రెండు తెలుగు సినిమాలు..
చాలా ఏళ్ల తర్వాత ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది అంజలి. దీంతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా అంజలి కనిపించనుంది. తెలుగులో ఇలా ఉండగా.. తమిళ, మలయాళ చిత్రాలతో కూడా అంజలి బిజీ అయిపోయింది. అంతే కాకుండా ఓటీటీ కంటెంట్‌తో కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ తెలుగమ్మాయి. తను పోటీని ఎప్పుడూ నమ్మనని, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఎప్పుడూ బిజీగానే ఉన్నానని అంజలి తాజాగా చెప్పుకొచ్చింది.


Also Read: అరెరే వేరే కథతో ప్రభాస్ 'రాజ్ సాబ్' సినిమా తీస్తున్నా - ఫన్నీగా స్పందించిన మారుతి