కార్తీ (Karthi) హీరోగా నటించిన తాజా తమిళ సినిమా 'మెయ్యళగన్' (Meiyazhagan). ఈ టైటిల్‌కు స్వచ్చమైన మనిషి లేదా నిజమైన మనిషి అని అర్థం. ఇందులో అరవింద్ స్వామి (Arvind Swamy) ప్రధాన పాత్ర చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'సత్యం సుందరం'గా శనివారం (సెప్టెంబర్ 28న) విడుదల చేస్తున్నారు. తమిళ ప్రేక్షకుల ముందుకు రేపు (శుక్రవారం, సెప్టెంబర్ 27న) విడుదల చేస్తున్నారు. అయితే, అక్కడ క్రిటిక్స్ అండ్ కామన్ ఆడియన్స్ కొంత మందికి ప్రీమియర్ షో వేశారు. సినిమా చూసినోళ్లు బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇంతకీ, వాళ్లు ఏం చెప్పారో చూడండి.


కార్తీ కెరీర్ బెస్ట్ 'సత్యం సుందరం'
'పరుత్తివీరన్'తో కార్తీ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా స్పెషల్ గనుక అది పక్కన పెడితే... ఆయన కెరీర్ బెస్ట్ 'సత్యం సుందరం' అని ఓ క్రిటిక్ ట్వీట్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత సింగిల్ షాట్ డైలాగ్స్, అప్పుడు నటనలో చూపించిన వేరియేషన్ అద్భుతం అని అన్నాడు. ఇందులో కార్తీ జోడీగా తెలుగు అమ్మాయి శ్రీ దివ్య నటించారు. ఆమెది చిన్న క్యారెక్టర్ అయినా బాగా చేశారని మరొక నెటిజన్ పేర్కొన్నారు. 










Also Read: ప్రతి సినిమా ఫ్లాప్ అనేవాడు... 'దేవర'కు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడు!



అరవింద్ స్వామికి మణిరత్నం కాదు...
అరవింద్ స్వామి బెస్ట్ ఫిలిమ్స్ అంటే ప్రేక్షకులకు మణిరత్నం గుర్తుకు వస్తారు. ఈ సినిమా చూశాక అరవింద్ స్వామికి దర్శకుడు ప్రేమ్ కుమార్ గొప్ప క్యారెక్టర్ రాశారని ప్రేక్షకులకు సైతం అనిపిస్తుందని చెప్పారు ఓ నెటిజన్. ఆయన కూడా అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. కమల్ హాసన్, మాధవన్ నటించిన 'అన్బే శివమ్' (తెలుగులో 'సత్యమే శివమ్' పేరుతో అనువదించారు)తో ఈ సినిమాను కంపేర్ చేశారు. ఈ తరానికి అటువంటి సినిమా అన్నారు.










ఫీల్ గుడ్... క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ 'సత్యం సుందరం' చిత్రానికి దర్శకుడు. ఆ సినిమాకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. అయితే... శర్వానంద్, సమంతతో తెలుగు 'జాను'గా ఆ సినిమాను రీమేక్ చేశారు. ఆశించిన విజయం దక్కలేదు. తమిళనాడు ప్రీమియర్ షో టాక్ చూస్తే... '96' తరహాలో మరోసారి ఫీల్ గుడ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇవ్వడంలో ప్రేమ్ కుమార్ సక్సెస్ అయ్యారని పలువురు చెబుతున్నారు. 


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే



కార్తీ, అరవింద్ స్వామి... ఇద్దరూ అద్భుతంగా నటించారని, ప్రేమ్ కుమార్ చక్కగా తీశారని, కొన్ని సినిమాలు చూసినప్పుడు లెంగ్త్ ఎంత? అనేది ప్రేక్షకులు కూడా పట్టించుకోరని, 'సత్యం సుందరం' సైతం అటువంటి సినిమా అని చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా... ఓ ఇద్దరు మాత్రం 5/5 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. 'సత్యం సుందరం' / 'మెయ్యిగళన్' సోషల్ మీడియా టాక్ ఎలా ఉందో ఈ కింద ట్వీట్లలో చూడండి.