'సత్యం' రాజేష్ (Satyam Rajesh) నటుడిగానూ ప్రేక్షకులకు తెలుసు. తనదైన నటనతో ఎన్నో సినిమాల్లో నవ్వించారు. నటుడిగా మెప్పించారు. ఆయనలో హీరో కూడా ఉన్నారని 'మా ఊరి పొలిమేర'తో తెలిసింది. ఆ సినిమా ఓటీటీలో విడుదల అయినప్పటికీ... మంచి పేరు, విజయం అందుకున్నారు 'సత్యం' రాజేష్. ఆ తర్వాత అదే సినిమా సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2'తో థియేటర్లలో భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చే నెలలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సత్యం రాజేష్ రెడీ అయ్యారు.


'సత్యం' రాజేష్ కథానాయకుడిగా 'టెనెంట్'
Satyam Rajesh new movie as main lead: 'సత్యం' రాజేష్ కథానాయకుడిగా మహా తేజ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'టెనెంట్' (Tenant Movie). దీనికి వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' తర్వాత దర్శకుడిగా ఆయన చేసిన చిత్రమిది. మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీనికి ముందు 'అద్భుతం' నిర్మించారు. రవీందర్ రెడ్డి ఎన్ సహ నిర్మాత. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


ఏప్రిల్ మూడో వారంలో 'టెనెంట్' విడుదల
Tenant Telugu Movie Release Date: ఏప్రిల్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా గురించి వారు మాట్లాడుతూ... ''ప్రజెంట్ జనరేషన్ మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా విలువైన సందేశంతో పాటు ఫ్యామిలీ, ఎమోషనల్, థ్రిల్లింగ్ వంటి అంశాలతో చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు రావాలని అనుకుంటున్నాం'' అని చెప్పారు.


Also Readమమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?


ఎమోషనల్ మర్డర్ మిస్టరీగా 'టెనెంట్' సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు వై యుగంధర్ చెప్పారు. సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలకు ఈ చిత్ర కథాంశం చాలా దగ్గరగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తప్పకుండా సినిమా చూడాలని కోరారు.


Also Readశవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్



సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్న 'టెనెంట్' సినిమాలో చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, 'ఆడుకాలం' నరేన్, ఎస్తేర్ నొరోన్హా, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేఘ్న తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి  కూర్పు : విజయ్ ముక్తవరపు, కళా దర్శకత్వం : కరకరాల చంద్రమౌళి, 8పీఎం సాయి,  స్టంట్స్ : రాబిన్ సుబ్బు, ఛాయాగ్రహణం : జెమిన్ జోం అయ్యనీత్,  క్రియేటివ్ నిర్మాత : ప్రసూన మండవ, కథ: వై.ఎస్.శ్రీనివాస వర్మ, సాహిత్యం, సంగీతం : సాహిత్య సాగర్, సహ నిర్మాత : రవీందర్ రెడ్డి ఎన్, నిర్మాత : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : వై. యుగంధర్.