Game Changer OTT Rights : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమాకు సంబంధించి సరైన అప్డేట్స్ లేకపోవడం, పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ఆ మధ్య 'గేమ్ ఛేంజర్: పై హైప్ తగ్గింది. మళ్లీ కొద్ది రోజుల నుంచి షూటింగ్ అప్డేట్స్ రావడం, కొన్ని ఫోటోలు లీకవ్వడం చరణ్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుందనే వార్తలతో ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ క్యూరియాసిటీ మొదలైంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఓటీటీ డీల్ గురించిన సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 'గేమ్ చేంజర్' డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న ఓ స్పెషల్ ఈవెంట్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ఆమెజాన్ భారీగా ఖర్చు చేసినట్లు తాజా సమాచారం. 


భారీ ధరకు 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్


రామ్ చరణ్ కెరియర్ లోనే మునుపెన్నడూ లేనివిధంగా 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ అత్యంత భారీ ధరకు అమ్ముడయ్యాయి. 'RRR' మూవీ కాకుండా ఇప్పటివరకు చరణ్ నటించిన సినిమాలకు మించి ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని తాజా సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ (దక్షిణాది భాషలతో కలిపి) కోసం ఏకంగా రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇక హిందీ డిజిటల్ రైట్స్ ని ZEE5 ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 






లీకైన రామ్ చరణ్ న్యూ లుక్


'గేమ్ ఛేంజర్' షూటింగ్ ని ఇటీవల వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో ప్లాన్ చేశారు. ఇక్కడే రామ్ చరణ్ న్యూ లుక్ లీకై సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఇందులో రామ్ చరణ్ క్లీన్ సేవ్, ఫార్మల్ షర్ట్ ప్యాంట్ ఫార్మల్ షూ తో ఆఫీసర్ లుక్ లో అదిరిపోయాడు. చరణ్ లుక్ మాత్రమే కాదు హీరోయిన్ కియారా అద్వానీ సింపుల్ సారీలో కనిపించి ఆకట్టుకుంది. చరణ్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ సైతం ఫిదా అయిపోయారు. గతంలో కూడా రామ్ చరణ్ పంచకట్టులో సైకిల్ తొక్కుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో చరణ్ 90's గెటప్ లో కనిపించారు. దీన్ని బట్టి 'గేమ్ చేంజర్' మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.


మార్చ్ 27 న ఫస్ట్ సింగిల్


రామ్ చరణ్ బర్త్ డే కానుకగా 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ సింగింగ్ షోలో కన్ఫామ్ చేశారు. చరణ్ బర్త్ డే కి 'గేమ్ చేంజర్' ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ స్వయంగా తమన్ చెప్పడంతో ఫ్యాన్స్ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Also Read : అనుష్క శెట్టి 50వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ - ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్ పోస్టర్!