సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించారు. మహేష్ సరసన కీర్తీ సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటించారు. మే 12న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. లేటేస్టుగా ట్రైలర్ (Sarkaru Vaari Paata Trailer) విడుదల చేశారు. మహేష్ ఫ్యాన్స్, ఘట్టమనేని అభిమానులకు ఈ ట్రైలర్ ఫుల్ కిక్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.


'సర్కారు వారి పాట' ట్రైలర్‌లో ఏముంది? అనే (SVP Trailer Review) విషయానికి వస్తే... మహేష్ బాబు హ్యాండ్స‌మ్‌గా క‌నిపించారు. ఎట్ ద సేమ్ టైమ్ యాక్షన్ మోడ్‌లో ఇరగదీశారు. 'నువ్వు నా ప్రేమను దొంగిలించగలవ్. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్. నువ్వు నా డబ్బు దొగించలేవు' అని మహేష్ బాబు చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగులో వచ్చే ఫైట్ బావుంది. 'అమ్మాయిలను, అప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలిరా. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు' అంటూ సూపర్ స్టార్ చేత డైలాగ్ చెప్పించిన దర్శకుడు పరశురామ్, ఆ తర్వాత సినిమాలో లవ్ యాంగిల్ కూడా ట్రైలర్ లో రివీల్ చేశారు. మహేష్, కీర్తీ సురేష్ మధ్య సీన్స్ బావున్నాయి. 'వెన్నెల' కిషోర్ కామెడీ, యాక్షన్, ఎమోషన్... ట్రైలర్ లో అన్నీ చూపించారు. ముఖ్యంగా మహేష్ డైలాగులు బావున్నాయి. ఆయన ఎనర్జీ ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ. అయితే, ఆయన నోటి వెంట కొన్ని డబులు మీనింగ్ డైలాగులు కూడా వినపడ్డాయి. 


Also Read: 'మహేష్ ఫ్యాన్స్ కు ఇదొక ట్రీట్' - 'సర్కారు వారి పాట' సినిమాపై కీర్తి కామెంట్






'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో అన్ని పాటలనూ అనంత శ్రీరామ్ రాశారు. కళా దర్శకుడు ఏఎస్ ప్రకాష్ అద్భుతమైన సెట్స్ వేశారు.


Also Read: ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?