సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. ఆయన అభిమానులకు మరో అప్‌డేట్‌! ఈ రోజు ట్రైలర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్ సూపర్ ఉందని దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. సినిమా దర్శకుడు పరశురామ్ అయితే ఆయన ట్వీట్ చేయడం ఏమిటని అనుకుంటున్నారా? ప్రేక్షకులు చూడటం కంటే ముందే ఆయన ట్రైలర్ చూశారు.


"ట్రైలర్ చూశా. మహేష్ బాబు స్వాగ్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. దర్శకుడు పరశురామ్ తన రైటింగ్ (డైలాగుల), టేకింగ్ తో మిమ్మల్ని స‌ర్‌ప్రైజ్‌ చేస్తాడు. గెట్ రెడీ గైస్, 'సర్కారు వారి పాట' ట్రైలర్ (Sarkaru Vaari Paata Trailer) ఫీస్ట్ (కన్నుల పండుగ)లా ఉండబోతోంది'' అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.






Also Read: అడివి శేష్ 'హిట్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?


మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా 'సర్కారు వారి పాట' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్