అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2' (HIT - Homicide Investigation Team). 'హిట్' సినిమాకు సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా... రెండో పార్ట్‌లో అడివి శేష్ నటించారు. అయితే... రెండు సినిమాలకూ దర్శక - నిర్మాతలు సేమ్. 


శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్‌నేని 'హిట్' ఫ్రాంచైజీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. జూలైలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు నేడు ప్రకటించారు.


Adivi Sesh's HIT 2 Movie Release Date: జూలై 29న 'హిట్ 2' సినిమాను విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు. "హిట్ యూనివర్స్ లో ప్రమాదకరమైన విషయం ఏదో బయట పడబోతోంది. వెన్నుముకలో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ ను జూలై 29, 2022న చూడటానికి రెడీ అవ్వండి'' అని హీరో అడివి శేష్, 'హిట్ 2' చిత్ర బృందం పేర్కొంది.


Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్


'హిట్ 2' కంటే ముందు జూన్ 3న 'మేజర్' సినిమాతో అడివి శేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అది. మొత్తం మీద... బ్యాక్ టు బ్యాక్, రెండు నెలల్లో రెండు సినిమాలతో అడివి శేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.



Also Read: ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?