Sarkaru Vaari Paata Box Office: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'కు ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఫేక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది పక్కన పెడితే... రెండో రోజు కూడా సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది.    


Sarkaru Vaari Paata Movie Box Office collection Day 2 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 'సర్కారు వారి పాట' సినిమా మొదటి రోజు రూ. 36.63 కోట్లు షేర్ కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. రెండో రోజు కూడా కలిపితే... రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో సినిమాకు రూ. 48.53 కోట్ల షేర్ వచ్చిందని, మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయని చిత్ర బృందం తెలియజేసింది. వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ రావొచ్చని పేర్కొంది. సినిమా బ్లాక్ బస్టర్ అని యూనిట్ అంటోంది.


అమెరికాలోనూ 'సర్కారు వారి పాట'కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి రోజు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన ఈ సినిమా... ఇప్పుడు 1.5 మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరింది.


Also Read: 'కెజియఫ్ 3' విడుదల ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్






కీర్తీ సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు.


Also Read: విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఎన్ని రోజులు అంటే?