KGF 3 Shooting Update and Release Date: యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కెజియఫ్ 1', 'కెజియఫ్ 2' సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'కెజియఫ్ 2' పతాక సన్నివేశాలు పూర్తయిన తర్వాత 'కెజియఫ్ 3' కూడా ఉంటుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వంటి ప్రశ్నలకు నిర్మాత విజయ్ కిరగందూర్ సమాధానం ఇచ్చారు. 


''ప్రస్తుతం 'సలార్' సినిమా పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ వీక్ నుంచి లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ కూడా జాయిన్ అవుతారు. ప్రజెంట్ 30 - 35 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లేదా నవంబర్‌కు షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 'కెజియఫ్ 3' స్టార్ట్ చేస్తాం. 2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని విజయ్ కిరగందూర్ తెలిపారు.


Also Read: అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ' థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందటే?


'కెజియఫ్ 3' షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు యశ్ మరో సినిమా చేస్తారా? లేదంటే ఆ సినిమా కోసం వెయిట్ చేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు 'కెజియఫ్ 2' (KGF 2) సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.


Also Read: విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఎన్ని రోజులు అంటే?