'హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చిన ప్రతిసారీ విక్టరీయే' - 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్. అది నిజమేనని సోషల్ మీడియాలో టాక్ చూస్తుంటే అర్థం అవుతోంది. విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇందులో హీరో భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు (జనవరి 14న) సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ సినిమా చూసిన నెటిజనులు ఏమంటున్నారు? ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
కామెడీతో కుమ్మేసిన వెంకీ మామ...
హిలేరియస్ పంచ్ ఇచ్చిన అనిల్!
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఏకైక లక్ష్యంతో థియేటర్లలోకి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని ఒక ఎన్ఆర్ఐ పేర్కొన్నారు. 'ఎఫ్ 2' తరహాలో తన టిపికల్ మార్క్ కామెడీతో అనిల్ రావిపూడి సినిమా తీశారట. చాలా వరకు కామెడీ వర్కౌట్ అయిందని మెజారిటీ జనాలు చెబుతున్నారు. కథ పెద్దగా లేదని ఈ సినిమాకు కామెడీ హైలైట్ అని లాజిక్స్ వంటివి పట్టించుకుంటే అసలు ఎంటర్టైన్ కాలేరని టాక్. 'హాయ్'కు ఈ సినిమాలో కొత్త మీనింగ్ ఇచ్చారట.
బుల్లి రాజు క్యారెక్టర్ మామూలుగా ఉండదు!
అమెరికాలో ప్రీమియర్లు చూసిన మెజారిటీ జనాలు చెబుతున్నది ఒకటే... బుల్లి రాజు క్యారెక్టర్ మామూలుగా ఎంటర్టైన్ చేయదని! 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్ చేసే కామెడీ ఆడియన్స్ అందరినీ నవ్విస్తుందని చెబుతున్నారు.
సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి విజేత 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అంటూ కొంత మంది పోస్టులు చేశారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వెంకటేష్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందట. ఆయన తర్వాత బుల్లి రాజు క్యారెక్టర్ కామెడీ, అలాగే భీమ్స్ అందించిన పాటలు - నేపథ్య సంగీతం నిలుస్తాయట. సినిమాకు మెయిన్ హైలైట్ కామెడీ అని అంటున్నారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే... కథ గొప్పగా ఏమీ లేదని, ప్రేక్షకులు ఊహించేలా ముందుకు వెళుతుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు ఉండడం మెయిన్ మైనస్ అంటున్నారు.
అతిథి పాత్రల్లో తళుక్కున మెరిసిన ఆ ఇద్దరు!
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో రెండు సర్ప్రైజ్ క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి పెళ్లి ఫేమ్ పృథ్వీ. 'యానిమల్' వంటి సినిమాలో ఆయన విలన్ రోల్ చేశారు. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ అందరిని సర్ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కూడా మరొక పాత్రలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా మీద వచ్చిన టాప్ 10 ట్వీట్స్ ఏమిటో చూడండి.
Also Read: 'గేమ్ చేంజర్' మీద ఆ ముఠా గూడుపుఠాణి... 45 మందిపై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్