టాలీవుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో వచ్చిన 'బుజ్జిగాడు' సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ, సినిమాకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డార్లింగ్ కెరియర్ లోనే 'బుజ్జిగాడు' ఓ కల్ట్ మూవీ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ, స్టైల్, యాక్షన్, లవ్ స్టోరీ ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరో కలెక్షన్ కి మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్జేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున 'బుజ్జిగాడు' సినిమా థియేటర్స్ లో విడుదలైంది.
అయితే ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ త్రిషాకు చెల్లెలుగా నటించిన సంజన ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు సంజన ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘బుజ్జిగాడు షూటింగ్ సమయంలో ఓ సంఘటన జరిగింది. ఆ సమయంలో నేను నా కారేవాన్ లో ఉన్నాను. బస్సులో ఓ యాక్షన్స్ సీన్ షూట్ చేసేటప్పుడు టేక్ అవుతున్న సమయంలో ప్రభాస్ బస్సు ముందు పడ్డారు. ఆ సమయంలో నాతో పాటు సెట్లో ఉన్న వాళ్లంతా ప్రభాస్ దగ్గరికి పరిగెత్తారు. ఆయన సేఫ్ గా ఉన్నాడా లేదా అని చూడడానికి. నాకు ఇప్పటికీ గుర్తు ప్రభాస్ అలా బస్సు కింద పడగానే, బస్సు ఆయన మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సమయంలో నేను ప్రభాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి 'మీరు బానే ఉన్నారు కదా! అని అడిగాను. నేనే కాదు సెట్ లో ఉన్న వాళ్లంతా ఒకసారి గా ఫ్యానిక్ అయిపోయారు అది చూసి’’ అని పేర్కొంది.
‘‘దేవుడి దయవల్ల ఆ సంఘటన జరిగినప్పుడు ప్రభాస్‌కు ఏమీ కాలేదు. ఆ సమయంలో మేమంతా భయపడిపోయాం. కానీ ప్రభాస్ మాత్రం చాలా కూల్ గా నేను బాగానే ఉన్నాను అని చెప్పారు. ప్రభాస్ చాలా గట్స్ ఉన్న వ్యక్తి. ఆ సమయంలో ఆయన నాకు రియల్ లైఫ్ హీరోలా అనిపించారు. ఇక ప్రభాస్ అలాంటి గట్స్ తోనే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అంటూ బుజ్జిగాడు సెట్స్ లో జరిగిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా అభిమానుతో పంచుకుంది సంజన.
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వాటిలో 'ఆదిపురుష్' మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడుగా నటిస్తున్నారు.
Also Read: Mem Famous: చివరికి కాకిని కూడా వదల్లేదుగా! ‘మేమ్ ఫేమస్’ టీమ్ ఫన్నీ ముచ్చట్లు