Sandeep Reddy Vanga Comments On Bollywood Critics : బాక్స్ ఆఫీస్ వద్ద 'యానిమల్' ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై 19 రోజుల దాటిన ఇంకా కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.850 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. ఇక ప్రస్తుతం ‘యానిమల్’ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినీ క్రిటిక్స్ ఫై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


"కొంతమంది క్రిటిక్స్ కి సినిమాలపై అవగాహన లేకుండానే రివ్యూలు ఇస్తున్నారు. గత ఐదేళ్లగా ముంబైలో ఉండటం వల్ల నాకో విషయం అర్థమైంది. బీ టౌన్ లో ఓ సినీ క్రిటిక్స్ టీం ఉంది. వాళ్లకు కొన్ని సినిమాలు మాత్రమే నచ్చుతాయి. మిగతా సినిమాలకు బ్యాడ్ రివ్యూలు ఇస్తారు. ‘అర్జున్ రెడ్డి’ మూవీ విషయంలో ఇదే జరిగింది. సినీ క్రిటిక్స్ కి డబ్బులు ఇచ్చే సంస్కృతి సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు" అని అన్నాడు. దీంతో సందీప్ రెడ్డి చేసిన ఈ విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.


అయితే సందీప్ కేవలం బాలీవుడ్ సినీ క్రిటిక్స్ పైనే స్వయంగా ఇలాంటి విమర్శలు చేయడంతో దీనిపై బాలీవుడ్ వాళ్లు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇక యానిమల్ సక్సెస్ తో దర్శకుడిగా సందీప్ రెడ్డి క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరడంతో అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ప్రభాస్‌తో 'స్పిరిట్' కాగా మరొకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్. ఈ రెండింటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా సందీప్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.


వీటి తర్వాత యానిమల్ సినిమాకు సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ ను కూడా తెరకెక్కించాలని సందీప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యానిమల్ విషయానికొస్తే.. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ తండ్రి పాత్ర పోషించగా బాబి డియోల్ విలన్ గా కనిపించారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి మరో స్పెషల్ రోల్ లో ఆకట్టుకుంది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు.


Also Read ; ఆయన హీరోలకే హీరో, మలయాళ స్టార్ మమ్ముట్టిపై జ్యోతిక ప్రశంసలు