Sandeep Reddy Vanga: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్,’అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన చిత్రం ‘యానిమల్‘. డిసెంబర్ 1న విడుదల అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్లు అనిల్ కపూర్, బాబీ డియోల్  కీలక పాత్రలు పోషించారు. అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా కనిపించగా, బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా విడుదలయ్యాక మరింత దుమ్మురేపింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా అద్భుతవిజయాన్ని అందుకుంది. మూవీపై కొన్ని విమర్శలు వచ్చినా, వసూళ్ల పరంగా సత్తా చాటింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 835 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.


‘యానిమల్ 3‘ కోసం ప్లాన్ చేస్తున్న సందీప్ వంగా


‘యానిమల్‘ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘యానిమల్ 2‘ను ప్రకటించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ‘యానిమల్ పార్క్‘ పేరుతో రూపొందనున్నట్లు తెలిపారు. 2026లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ‘యానిమల్ 3‘ కోసం ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు. ‘యానిమల్ పార్క్‘ సెట్స్ మీదకు రాకముందే, ప్రస్తుతం ఆయన కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాల్సి ఉంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయనున్నారు. ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్‘ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024లో ప్రారంభం కానుంది. అటు అల్లు అర్జున్ తోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విషయం ఇప్పటికీ అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ‘యానిమల్ 3‘ ఎప్పుడు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ‘యానిమల్ పార్క్‘ సక్సెస్ మీద ఆధారపడి ‘యానిమల్ 3‘ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది.     


యానిమల్ మూవీ గురించి..


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ తో కూడిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల అయ్యింది. ఈ మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ తో పాటు మితిమీరిన వైలెన్స్ ఉందనే విమర్శలు వినిపించాయి. పార్లమెంట్ లోనూ ఈ సినిమాపై చర్చ జరిగింది. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి మంచికంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.


Read Also: కథ వినకుండానే నో చెప్పాడు, విజయ్ దళపతిపై దర్శకుడు లింగుస్వామి షాకింగ్ కామెంట్స్