Maaya One Teaser Out: యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. ప్రస్తుతం అతడు సందీప్‌ కిషన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల 'ఊరు పేరు భైరవకోన' మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు సందీప్‌ కిషన్‌. అదే జోష్‌లో వరుస ప్రాజెక్ట్స్‌కి కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో సైన్స్‌ ఫిక్షన్‌ 'మాయ వన్‌' (Maaya One) చిత్రం ఒకటి. గతంలో తమిళ డైరెక్టర్‌ సి.వి కుమార్‌ దర్శకత్వంతో వచ్చిన మాయావన్‌ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.


ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌, అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సీక్వెల్‌ను అదే టైటిల్‌తో మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. ఇక తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. పూర్తి సైన్స్‌ అంశాలతో సాగిన టీజర్‌ మూవీపై ఆసక్తి పెంచుతుంది. కామన్ మ్యాన్‌కి సూపర్ విలన్‌కు మధ్య సాగే వార్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. 



నటుడు మురళీ శర్మ బ్యాగ్రౌండ్‌ వాయిసతో టీజర్‌ సాగింది. "ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూస్తే.. తనని తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషి మారింది రాక్షసుడిగా మాత్రమే. అలాంటి రాక్షసుడు పుట్టుకొచ్చిన ప్రతిసారి ఆ దేవుడు పంపేది మొండితనాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడే ఓ సామాన్యుడినే" అంటూ మొరళీ శర్మ చెప్పిన పవర్ఫుల్‌ టీజర్‌ ఆకట్టుకుంటుంది. ఇక సర్వం నేనే, సమస్థం నేనే.. సైన్స్‌ నేనే.. గాడ్‌ అంటూ విలన్‌ ఎంట్రీ అదుర్స్‌ అనేలా ఉంది. ఆ తర్వాత హీరో సందీప్‌ కిషన్‌ ఎంట్రీ అయితే టీజర్‌కే హైలెట్‌ అని చెప్పాలి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అయితే మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. కామన్‌ మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌ విలన్ అనే క్యాప్షన్‌తో మూవీ టీం టీజర్‌ రిలీజ్ చేసింది. సైన్స్‌తో ప్రపంచాన్ని శాసించాలనుకునే సూపర్‌ విలన్‌కు సామాన్యుడైన హీరోకు మధ్య జరిగే పోరాటమే ఈ మాయవన్‌ కథ అని అర్థమవుతుంది. ఇక టీజర్‌ చివర్లో హీరోకి కూడా సూపర్‌ పవర్స్‌ రావడం చూపించి మరింత ఆసక్తి పెంచారు. ఇక సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగిన టీజర్‌లో విజువల్స్‌ కూడా అద్భుతంగా రూపొందించారు. మొత్తానికి టీజర్‌ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. 







Also Read: ఆ బిరుదు అందుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ - నిజంగా.. సాయి పల్లవి 'హైబ్రిడ్‌ పిల్లే!'