ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) నిర్మాతగా మారారు. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి... చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన తొలి సినిమా 'శుభం' (Shubam Movie). చచ్చినా చూడాల్సిందే... అనేది ఉప శీర్షిక. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. 


'శుభం' షూటింగ్ కంప్లీట్ అయ్యిందోచ్!
Shubam shoot wrapped up: 'శుభం' చిత్రీకరణ విజయవంతంగా పూర్తి అయ్యిందని సమంత తెలిపారు. అంతే కాదు... త్వరలో ఈ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు ఈ సినిమా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం.


'శుభం' చిత్రానికి 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పరదా'కు సైతం ఆయనే దర్శకత్వం వహించారు. మరి, ఈ రెండిటిలో ఏ సినిమా ముందుగా విడుదల అవుతుందో చూడాలి. 'శుభం' సినిమాకు వసంత్ మరిగంటి కథ అందించారు.


Also Readబీ హ్యాపీ రివ్యూ: Prime Videoలో అభిషేక్ బచ్చన్ సినిమా...  స్టైల్, హాయ్ నాన్న చూసిన తెలుగు ఆడియన్స్‌కు ఈ డ్యాన్స్‌ బేస్డ్ డ్రామా నచ్చుతుందా?






Shubam Movie Cast And Crew: త్రాలాల బ్యానర్ మీద 'శుభం' సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే ప్రేక్షకులు అందరికీ తెలుస్తుందని సమంత అన్నారు. ఇందులో సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక, ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించగా... రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ డిజైన్ పనులు చూసుకున్నారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌‌. 


Also Read'సూక్ష్మదర్శిని'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో... ఇప్పుడు 'పొన్‌మాన్‌'తో JioHotstarలోకి వచ్చాడు... గోల్డ్ రికవరీ కాన్సెప్ట్‌తో బసిల్ జోసెఫ్ ఏం చేశారంటే?



'సినిమా బండి'తో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణిని ప్రవీణ్ కండ్రేగుల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాతో మరికొందరిని పరిచయం చేయనున్నట్టు చెప్పారు.