Kunchacko Boban's Officer On Duty Movie OTT Release On Netflix: మలయాళ స్టార్ హీరో కుంచకో బొబన్, ప్రియమణి (Priyamani) జంటగా నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' (Officer On Duty). మలయాళంలో ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో మార్చి 14న విడుదలైంది. మలయాళంలో హిట్ టాక్ సొంతం చేసుకోగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.


ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్


ఈ సినిమా ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్‌లో విడుదలైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. 






Also Read: అసలు ఎవరీ జాబిలి? - 'కోర్ట్' మూవీ నటి శ్రీదేవి మన తెలుగమ్మాయే.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?


స్టోరీ ఏంటంటే..?



హరిశంకర్ (కుంచకో బొబన్) కొచ్చిలో సీఐగా పని చేస్తుంటారు. అతని భార్య గీత (ప్రియమణి), కుమార్తెతో కలిసి ఉంటాడు. సస్పెన్షన్ తర్వాత విధుల్లో చేరిన హరి శంకర్‌కు ఆ రోజు ఓ గోల్డ్ చైన్ కేసు వస్తుంది. విచారణలో భాగంగా ఓ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ కోసం పిలవగా.. ఆమె సూసైడ్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి తండ్రి హరిశంకర్‌పై ఆరోపణలు చేయగా.. ఈమె ఆత్మహత్యకు ఓ పోలీస్ ఆత్మహత్యకు, కేసుకు సంబంధం ఉందని హరి శంకర్ అనుమానిస్తాడు. 


ఈ క్రమంలోనే నగరంలో బంగారు ఆభరణాల కేసును లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా.. మరిన్ని క్రైమ్స్ బయటపడుతుంటాయి. సెక్స్ రాకెట్, డ్రగ్స్ కేసులు చాలా బయటపడతాయి. వీటన్నింటినీ హరిశంకర్ ఎలా విచారించాడు.?, బెంగుళూరు ముఠాకు దీనికి సంబంధం ఏంటి.?, హరిశంకర్ నుంచి భార్య గీత ఎందుకు విడాకులు కోరింది.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ట్విస్టులు, సస్పెన్సులు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంశాలతో ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.