'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె' (Chef Mantra Project K) పేరుకు కుకింగ్ షో. అయితే, ఆ షోలో వంటల కంటే ఎక్కువ కామెడీ ఉంటోంది. పృథ్వీ మీద విష్ణుప్రియ తన ప్రేమను ఎప్పటికప్పుడు చాటుతూ ఉంటోంది. సుమ కనకాల యాంకరింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతోంది. 'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె' సెకండ్ ఎపిసోడ్ ఇవాళ్టి (మార్చి 14) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి, అది ఎలా ఉందో చూడండి. 


జీవన్ గారూ... పెళ్లి అవ్వుద్దా?
విష్ణుప్రియ స్పాంటేనియస్ పంచ్!
జీవన్ పేరును చేతి మీద పచ్చబొట్టు చేయించుకున్నట్టు 'బ్రహ్మముడి' ఫేమ్ దీపికా రంగరాజు బిల్డప్ ఇస్తే... 'నీకు దణ్ణం తల్లి, పెళ్లి కానోడిని పట్టుకుని ఇలా పేర్లు రాస్తే పెళ్లి కూడా కాదు' అని జీవన్ అన్నారు. వెంటనే విష్ణుప్రియ 'ఇంకా అయ్యిద్దని అనుకుంటున్నారా?' అని అనడంతో మిగతా అందరూ నవ్వేశారు. ఆయన మాత్రం గుండె పట్టుకున్నారు.


'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె' సెకండ్ ఎపిసోడ్ మొత్తంలో విష్ణు ప్రియ కామెడీ, ఆవిడ వేసిన పంచ్ డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. పృథ్వీని చూస్తే బెండకాయ్ గుర్తుకు వస్తుందని విష్ణుప్రియ చెప్పింది. ఎందుకు? అని సుమ అడిగితే... 'హీ ఈజ్ మై గుండెకాయ్' అని చెప్పింది. ఆ మాటకు పృథ్వీ కూడా నవ్వేశాడు.


అంతకు ముందు 'రంగస్థలం'లో పాటకు ఆవిడ చేసిన డ్యాన్స్ మీద సుమతో పాటు అమర్ దీప్ చౌదరి కూడా పంచ్ డైలాగ్స్ వేశారు. విష్ణుకు నడుము ఎక్కడ ఉందని అమర్ దీప్ అంటే... 'నువ్వు ఏదో ఒకటి మాట్లాడు పృథ్వీ' అని విష్ణు ప్రియ అడిగింది. విష్ణు నడుము గురించి పృథ్వీ ఏం చెబుతాడని అర్జున్ అంబటి వేసిన పంచ్ పేలింది.


సుమకు రాజీవ్ కనకాల సర్‌ప్రైజ్!
పెళ్లి రోజు సందర్భంగా సుమకు రాజీవ్ కనకాల సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె' షూటింగ్ టైంలో వచ్చారు. అక్కడ కేక్ కట్ చేశారు. 'తండేల్' సినిమాలో సాయి పల్లవిని 'బుజ్జి తల్లి' అని నాగ చైతన్య అంటారు కదా! అలా అనమని దీపికా రంగరాజు అన్నారు. అయితే ఆవిడ 'బుజ్జి తల్లి' బదులు 'పిచ్చి తల్లి'  అన్నారు. దాంతో అందరూ నవ్వేశారు. సుమ ఇంటికి వెళ్లకుండా భర్తకు సర్‌ప్రైజ్ ఇస్తానని అనడం షో హైలెట్ మూమెంట్.


Also Read'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?


షో స్టార్టింగ్‌లో పంపుసెట్టు అంటూ అర్జున్ అంబటి, అమర్ దీప్ చేసిన కామెడీ సరిగా వర్కవుట్ కాలేదు. 'అడవిలో హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్స్‌లా బావున్నారు' అంటూ వాళ్లిద్దరి మీద సుమ కనకాల వేసిన పంచ్ డైలాగ్ ఓకే. 'ఫస్ట్ రాకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా' అని యాదమ్మ రాజు అంటే... 'ఇండస్ట్రీకి సువర్ణావకాశం వాడుకుంటుందో లేదో' అని సుమ వేసిన స్పాంటేనియస్ పంచ్ పేలింది. లాస్ట్ ఎపిసోడ్ కామెంట్స్ దృష్టిలో పెట్టుకున్నారో ఏమో... ప్రషు కపుల్ స్క్రీన్ టైమ్ తగ్గించారు. దీపికా రంగరాజు - సమీరా భరద్వాజ్ కామెడీ కూడా ఆశించిన స్థాయిలో ఈ ఎపిసోడ్‌లో లేదు. 


రెండో ఎపిసోడ్ లో వంటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.‌ పూతరేకులు చేయాలని టాస్క్ ఇచ్చారు.  ఒక్కరంటే ఒక్కరికి కూడా సరిగా చేయడం రాలేదు. వాళ్ళు చేసే ప్రాసెస్ మీద కామెడీ కూడా పండలేదు. ఫస్ట్ ఎపిసోడ్ మైసూర్ బజ్జీలు వేసేటప్పుడు కామెడీ పండింది. పూతరేకులు చేసే సమయంలో జీవన్ గుండు మీద వేసిన డైలాగ్స్ బాలేదు. అక్కడ కామెడీ కూడా రాలేదు. తర్వాత జంతికలు వేయించారు. నా ప్రాసెస్ లో కూడా టెన్షన్ లేదు కామెడీ లేదు. ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే కామెడీ వరకు ఎంజాయ్ చేయొచ్చు. వంటల కార్యక్రమాన్ని... అంటే వంట చేసే పోర్షన్స్ స్కిప్ కొట్టొచ్చు. 40 మినిట్స్ ఎపిసోడ్‌లో హైలెట్ మూమెంట్స్ అన్నీ 5 మినిట్స్ ప్రోమోలో చూపించారు. దాంతో ఎపిసోడ్ ఇచ్చే కిక్ చూసేటప్పుడు మిస్ అయ్యింది. 


Also Read'కోర్టు చూడండి... నచ్చకపోతే నా 'హిట్ 3' చూడటం మానేయండి' అని నాని చెప్పారు. మరి, కోర్టు ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి